వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘స్పుత్నిక్-వీ’తో యాంటీబాడీలు ఉత్పత్తి - లాన్సెట్ జర్నల్ వెల్లడి - విమర్శకుల సమాధానమన్న రష్యా

|
Google Oneindia TeluguNews

ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ గా రికార్డులకెక్కిన రష్యా తయారీ 'స్పుత్నిక్-వీ'పై మిగతా దేశాలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్న దరిమిలా దానికి సంబంధించి ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. ఇప్పటికే 'స్పుత్నిక్-వీ'పై నెగటివ్ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు రష్యా ప్రభుత్వం sputnikvaccine.com అనే వెబ్ సైట్ ను ప్రారంబించగా, ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత 'లాన్సెట్ మెడికల్ జర్నల్' సైతం రష్యా వ్యాక్సిన్ ప్రయోగాలు సక్సెస్ ఫుల్ గా సాగుతున్నట్లు నిర్ధారించింది.

 ‘స్పుత్నిక్-వీ'తో యాంటీబాడీలు

‘స్పుత్నిక్-వీ'తో యాంటీబాడీలు

రష్యా తయారుచేసిన స్పుత్నిక్-వీ కొవిడ్-19 వ్యాక్సిన్ వల్ల శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని ‘లాన్సెట్' వెల్లడించింది. ఈ ఏడాది జూన్‌-జులైలో వ్యాక్సిన్‌పై నిర్వహించిన రెండు దశల పరీక్షలో పాల్గొన్న 76 మందిలోనూ కోవిడ్‌-19ను ఎదుర్కొనే యాంటీ బాడీలు అభివృద్ధి చెందాయని, ఏ ఒక్కరిలోనూ తీవ్ర సైడ్‌ఎఫెక్ట్స్‌ కనిపించలేదంటూ లాన్సెట్‌ శుక్రవారం ప్రచురించిన జర్నల్ లో పేర్కొంది.

రష్యా వ్యాక్సిన్ సురక్షితం..

రష్యా వ్యాక్సిన్ సురక్షితం..

స్పుత్నిక్-వీతో యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతున్నాయన్న ‘లాన్సెట్'.. వ్యాక్సిన్ ను దీర్ఘకాంలో సేఫ్ గా, మరింత ఎఫెక్టివ్ గా తీర్చి దిద్దేందుకు పెద్ద ఎత్తున పరీక్షలు, మరింత పర్యవేక్షణ అవసరమని అభిప్రాయపడింది. ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్ గా ముందుకొచ్చిన ‘స్పుత్నిక్-వీ'ని రష్యా అధ్యక్షుడు పుతిన్ కూతురికి కూడా అందించినట్లు చెప్పినా.. తొలి రెండు దశల క్లికిల్ ట్రయల్స్ వివరాలు వెల్లడికాకపోవడం అనేక అనుమానాలకు తావిచ్చినట్లయింది. అమెరికా బాహాటంగానే రష్యన్ వ్యాక్సిన్ ను కొట్టిపారేయగా, ఒక దశలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం స్పుత్నిక్-వీ సేఫ్టీపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దశలో ‘లాన్సెట్ జర్నల్' ప్రచురించిన రిపోర్టుతో రష్యా వ్యాక్సిన్ సురక్షితమేనన్న విషయం తేటతెల్లమైందని రష్యన్ డెరెక్టర్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) చీఫ్ కిరిల్ దిమిత్రోవ్ అన్నారు.

ఇక ప్రశ్నించడం మా వంతు..

ఇక ప్రశ్నించడం మా వంతు..

‘‘సైన్స్ జర్నల్స్ కు సంబంధించి లాన్సెట్ అత్యంత విశ్వసనీయమైన పత్రిక. అందులో తొలిసారి మా ‘స్పుత్నిక్-వీ' కొవిడ్ వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాల గురించి రాశారు. దీంతో మా వ్యాక్సిన్ పై వెల్లువెత్తుతోన్న అనుమానాలకు సమాధానం దొరికినట్లయింది. ఇక, ఇతర దేశాల వ్యాక్సిన్ల పని తీరును ఇప్పుడు మేం ప్రశ్నిస్తాం'' అని దిమిత్రోవ్ వ్యాఖ్యానించారు. స్పుత్నిక్-వీపై మలిదశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోన్న రష్యా.. ఈ ఏడాది చివరి నాటికి గరిష్టంగా 20 లక్షల డోసుల్ని ప్రజల కోసం అందుబాటులోకి తెస్తామని చెబుతోంది. త్వరలోనే వాణిజ్య పరమైన ఉత్పత్తిని కూడా ప్రారంభిస్తామంటోంది.

English summary
Russia's "Sputnik-V" COVID-19 vaccine produced an antibody response in all participants in early-stage trials, according to results published on Friday by The Lancet medical journal that were hailed by Moscow as an answer to its critics. The results of the two trials, conducted in June-July this year and involving 76 participants, showed 100% of participants developing antibodies to the new coronavirus and no serious side effects, The Lancet said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X