వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

7.35 శాతానికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం, 40 నెలల గరిష్టస్థాయికి, ఆహార ద్రవ్యోల్బణం కూడా...

|
Google Oneindia TeluguNews

రిజర్వ్ బ్యాంక్ విధించిన పరిమిత లక్ష్యాన్ని మించి రిటైల్ ద్రవ్యోల్బణం 7.35 శాతానికి చేరింది. నవంబర్‌లో ఇది 5.54 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. 2014 జులై తర్వాత రిటైల్ ద్రవ్యోల్బణం అధికస్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి. ఐదేళ్ల క్రితం 7.39 శాతం రికార్డైంది. ఆర్థిక వ్యవస్థ మరింత మందగించడం ఆందోళనకు గురిచేస్తోంది.

నవంబర్‌లో 5.54 శాతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం.. డిసెంబర్ నాటికి 2.11 శాతం పెరిగి 7.35 శాతానికి చేరుకుందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు సూచిస్తున్నాయి. ఇది 40 నెలల గరిష్ట స్థాయికి చేరుకుందని.. నవంబర్ నుంచి మరింత పెరిగిందని వినియోగదారుల ధరల సూచిక తెలిపింది.

Retail inflation spikes to 7.35% in December, highest in six years

ఆహార ద్రవ్యోల్బణం రేటు పెరగడం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. డిసెంబర్‌లో ఇది గరిష్ట స్థాయికి చేరడం ఆర్బీఐ వర్గాల్లో ఆందోళన పెరిగింది. 2019 నవంబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం 10.01 శాతం నుంచి 14.12 శాతానికి పెరిగింది. నవంబర్‌ నుంచి డిసెంబర్ వరకు అదీ 60.5 శాతానికి పెరగడం ఆందోళన కలుగజేస్తోంది.

రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ 4 ప్లస్ 2గా అంచనా వేసింది. కానీ అదీ మరింత పెరిగి ఆర్బీఐ అంచనాను నిజం చేసింది. డిసెంబర్‌లో ఆర్బీసీ రెపోరేటు తగ్గింపునకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న.. వరుసగా మూడునెలలు ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున.. సెంట్రల్ బ్యాక్ ఏ చర్యలు తీసుకుంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది.

English summary
Retail inflation for the month of December 2019 has sharply spiked to 7.35 per cent from 5.54 per cent a month ago, breaching the rbi upper-limit target.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X