వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దొంగతనాన్ని అడ్డుకున్నందుకు మాజీ ఆర్మీ ఆఫీసర్‌ను హత్య చేసిన దుండగులు

|
Google Oneindia TeluguNews

అమేథీ : ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. అమేథీలో కొందరు దుండగులు రెచ్చిపోయారు. దొంగతనాన్ని అడ్డుకున్నందుకు మాజీ ఆర్మీ ఆఫీసర్‌పై దాడికి దిగారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మాజీ సైనికాధికారి స్పాట్‌లోనే చనిపోయాడు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్ అమేథిలోని గోడియాన్ కా పుర్వా గ్రామంలో మాజీ ఆర్మీ ఆఫీసర్ అమానుల్లా కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి కొందరు దుండగులు వారి ఇంట్లోకి ప్రవేశించి కర్రలతో ఆయనపై దాడి చేశారు. ఇంటి పక్కన ఉన్న షాపులో దుండగులు దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తుండగా గమనించిన అమానుల్లా వారిని అడ్డుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో కక్ష పెంచుకున్న దుండగులు దాడికి పాల్పడ్డారు.

బొమ్మ తుపాకీతో బెదిరించి అత్యాచార యత్నం.. కామాంధుడి నాలుక కొరికి తప్పించుకున్న మోడల్..బొమ్మ తుపాకీతో బెదిరించి అత్యాచార యత్నం.. కామాంధుడి నాలుక కొరికి తప్పించుకున్న మోడల్..

Retired Army officer thrashed to death in Amethi

దుండగులు అమానుల్లా తలపై కొట్టడంతో ఆయన స్పాట్‌లోనే చనిపోయాడు. ఘటన జరిగిన సమయంలో అమానుల్లా ఆయన భార్య తప్పించి ఇతర కుటుంబసభ్యులెవరూ ఇంట్లో లేకపోవడంతో ఈ దారుణం జరింది. విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపారు. మృతుడి కుమారుడు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.

మాజీ ఆర్మీ అధికారి హత్యపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ ఫైర్ అయ్యారు. యోగి ఆదిత్యనాథ్ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పారు. ఇలాంటి ఘటనల్ని దాచే ప్రయత్నం చేయడం మానుకుని ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి వాటికి పరిష్కారం చూపాలని హితవు పలికారు.

English summary
A 64-year-old retired Army captain was beaten to death by unidentified men in Uttar Pradesh's Amethi district
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X