వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిటైర్డ్ జడ్జీలను హైకోర్టు అదనపు జడ్జీలుగా నియమించుకోవచ్చు: తేల్చేసిన సుప్రీం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రిటైర్డ్ జడ్జీలను తిరిగి నియమించుకోవడంపై దాఖలైన పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ వీరేంద్ర కుమార్, జస్టిస్ రామచంద్ర సింగ్ ఝాలాలను రాజస్థాన్ హైకోర్టులో అదనపు జడ్జీలుగా నియమించడాన్ని సవాల్ చేస్తూ సునీల్ సందారియా అనే న్యాయవాదిపై సుప్రీంకోర్టులో పిటిసన్ దాఖలు చేశారు.

పిటిషన్ విచారించిన జస్టిస్ ఏకే సిక్రీ, అశోక్ భూషణ్‌తో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ నియామకాలను సమర్థించింది. రిటైర్డ్ జడ్జీలను తిరిగి నియమించుకోవచ్చని స్పష్టం చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 217(3)(ఏ) కింద రిటైర్డ్ న్యాయాధికారులను హైకోర్టు జడ్జీలుగా నియమించుకోవచ్చని తెలిపింది.

Retired District Judges Can Be Appointed To HCs, Additional HC Judges Can Be Appointed For A Tenure Of Less Than 2 Yrs :SC

అయితే, వారు రాష్ట్రంలోని న్యాయ విభాగంలో సేవలందించి ఉండాలని తెలిపింది. రిటైర్డ్ జిల్లా జడ్జీలను కూడా హైకోర్టుల్లో అదనపు జడ్జీలుగా నియమించుకోవచ్చని సుప్రీం ధర్మాసంన స్పష్టం చేసింది. ఈ నియామకాలు రెండేళ్లకు మించిన పదవీ కాలానికి ఉండకూడదని పేర్కొంది.

English summary
The Supreme Court bench of Justices A. K. Sikri and Ashok Bhushan, on Friday, pronounced judgment on the writ petition filed by advocate Sunil Samdaria challenging the appointment of Justice Virendra Kumar Mathur and Justice Ram Chandra Singh Jhala as Additional Judges of Rajasthan High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X