వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్వీసులో నిజాయితీ గల పోలీసు అధికారి, రిటైర్డ్ అయ్యాక అవినీతి పరుడయ్యాడు, ఎందుకిలా

సర్వీసులో ఉన్న సమయంలో నిజాయితీ అధికారిగా పేరు తెచ్చుకొని ఉద్యోగం మానివేశాక సతీష్ అనే వ్యాపారి నుండి 83 లక్షలను దోచుకొన్న పోలీసు అదికారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బెంగుళూరులో జరిగింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు :నిజాయితీ గల పోలీసు అదికారిగా పేరు తెచ్చుకొన్నాడు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పారిశ్రామిక వేత్తను బెదిరించి 83 లక్షలను దొంగిలించాడు. ఈ కుట్రకు పాల్పడిన రిటైర్డ్ పోలీసు అధికారిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ ఘటన బెంగుళూరులో చోటుచేసుకొంది.

బెంగుళూరులోని సతీష్ అనే వ్యాపారి నుడి 83 లక్షల రూపాయాల విలువైన పాత నోట్లను ఎసిబి అధికారులుగా నమ్మించి మోసం చేసిన ఘ టనలో రిైటర్డ్ పోలీసు అధికారిని పోలీసులు అరెస్టు చేశారు.

బెంగుళూరులోని జెపినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన బుదవారం రాత్రి జరిగింది.రద్దుచేసిన ఐదువందలు, వెయ్యి రూపాయాల నగదును బ్యాంకుల్లో జమ చేసి తమ ఖాతాలకు బదిలీ చేయాలని సతీష్ అనే వ్యాపారికి ఆయన వ్యాపార భాగస్వామ్యులు కోరారు.ఆయన వద్ద 83 లక్షల నగదు సమకూరింది.అయితే ఈ నగదు విషయం రిైటర్డ్ ఎసిపి బాబు నర్హోనాతో పాటు లోహిత్ లు గుర్తించారు.

retired police officer arrest in banglore

సతీష్ నుండి ఈ నగదును దోచుకోవాలని పథకం వేశారు. నవంబర్ 24వ, తేదిన సతీష్ ఇంటికి వెళ్ళి తాము కేంద్ర నేర నియంత్రణ ఆదాయపన్ను శాఖాధికారులమని పరిచయం చేసుకొన్నారు. గుర్తింపు కార్డులను చూపారు. నకిలీ గుర్తింపు కార్డులను చూపారు. సతీష్ ఇంట్లో సోదాలు నిర్వహించి ఆయన 83 లక్షలను స్వాధీనం చేసుకొన్నారు.

ఈ మేరకు 83 లక్షలకు రశీదు ఇచ్చి నవంబర్ 25వ, తేదిలోపుగా నగదుకు సంబంధించి వివరణ ఇవ్వాలని బెదిరించారు. వారుచెప్పిన సమయానికి కార్యాలయానికి వెళ్ళి విచారణ చేస్తే రశీదు అసలు ది కాదని తేలింది. మరో వైపు సతీష్ తాను మోసపోయాయని తెలుసుొని పోలీసులను ఆశ్రయించాడు. సతీష్ ను మోసం చేసిన ముఠాను పోలీసులు వెంటనే గుర్తించారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు నిజాయితీ అధికారిగా గుర్తింపుతెచ్చుకొన్న వ్యక్తే రిటైర్ అయిన తర్వాత సతీష్ వద్ద నగదును దోచుకొన్న ముఠాకు నాయకత్వం వహించాడని తెలుసుకొని నివ్వెర పోయాడు.

English summary
retired police officer and his friends thretned a business man satish , and take the amount from him around 83 lakhs.babu narohana retired policen officer, when he in service he is identified very honest officer . babu and his friend went to satish's house take 83 lakhs without evidence, please submit evidence ordered babu. a reciept also given to satish. satish complient to police. police traceout retired police officer babu cheating satish.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X