వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్య తీర్పుపై రిటైర్డ్ జడ్డి అసంతృప్తి... మైనారీలకు న్యాయం జరగలేదన్న గంగూలీ

|
Google Oneindia TeluguNews

అయోధ్య వివాదంపై సుప్రీం ధర్మాసం వెలువరించిన తీర్పుపై మరో సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వివాదస్పద స్థలాన్ని రామజన్మ న్యాస్‌కు మందిర నిర్మాణం కోసం అప్పగించడాన్ని సరైన నిర్ణయం కాదని సుప్రీం కోర్టు రిటైర్డ్ జస్టీస్ అశోక్ కుమార్ గంగూలీ వ్యాఖ్యానించారు. ఇది మైనారీటిల్లో చాల ఆసంతృప్తిని మిగుల్చుతుందని పేర్కోన్నారు. ఇక సుప్రీం తీర్పుతో తాను కలత చెందానని ఆయన వ్యాఖ్యానించారు.

రాజ్యంగం ప్రకారం ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నాయని, అయితే ఈ కేసులో మైనారీటిలకు న్యాయం జరగలేదని అన్నారు. బాబ్రీ మసీదును కూల్చి వేశారనేది, కాదనలేని నిజమని చెప్పారు. ఈ అంశంపై సుప్రీం కోర్టు సైతం తన తీర్పులో బాబ్రీ విధ్వంసం చట్టవిరుద్దమని స్పష్టం చేసిందని తెలిపారు. ఈ తీర్పుతోనే మైనారీటీలకు అన్యాయం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.

Retired Supreme Court judge Ashok Kumar Ganguly disturbed by the Ayodhya judgment

దశాబ్ద కాలంగా నలుగుతున్న అయోధ్య వివాదానికి సుప్రిం కోర్టు చీఫ్ జస్టీస్ రంజన్ ‌గోగోయ్‌తో కూడిన అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును చెప్పింది. నలబై రోజుల పాటు సుదీర్ఘ వాదనలు ధర్మాసం సంచలన తీర్పును వెలువరించింది. అయితే సుప్రీం తీర్పును ముస్లిం వర్గాలతో పాటు పలు రాజకీయ పార్టీలు సైతం స్వాగతించాయి. దీంతో మెజారీటి ముస్లింలు కనీసం రివ్యూ పిటిషన్‌కు వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. అయితే న్యాయమూర్తులు వెలువరించిన తీర్పును మరో రిటైర్డ్ న్యాయమూర్తి వ్యతిరేకించడం గమనార్హం.

English summary
Retired Supreme Court judge Asok Kumar Ganguly raised questions about the Supreme Court’s verdict.and he said that was disturbed by the judgment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X