వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పటి మాట: శశికళపై జయకు ఎంజీఆర్ హెచ్చరిక, ఆశ అందుకే..

శశికళ గురించి ఎంజీఆర్ అప్పట్లో జయలలితను హెచ్చరించిన విషయంపై ఇప్పుడు చర్చ సాగుతోంది. ఓ జ్యోతిష్కుడి మాటను పట్టుకుని శశికళ సిఎం పీఠంపై కన్నేసినట్లు తెలుస్తోంది.

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: చిన్నమ్మ శశికళ గురించి అప్పట్లో ఎంజి రామచంద్రన్ జయలలితను హెచ్చరించారనే విషయంపై ఇప్పుడు చర్చ సాగుతోంది. అన్నాడియంకె నేతలు ఎంజిఆర్, జయలలితలతో తన అనుభవాలపై వలంపురి జాన్ అప్పట్లో ఓ వారపత్రికలో రాశారు. ఆయన అన్నాడియంకె పార్లమెంటు సభ్యుడిగా కూడా పనిచేశారు.

శశికళకు పన్నీరుసెల్వం మరో షాక్: గతంలో జయకు శశికళ లేఖ, ఏముందంటే..? శశికళకు పన్నీరుసెల్వం మరో షాక్: గతంలో జయకు శశికళ లేఖ, ఏముందంటే..?

ఆ వార్తాకథనాన్ని జాన్ 1990లో రాశారు. అందులో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆయన వ్యాసంలోని వివరాల ప్రకారం - జయలలితను 1987లో ఎంజిఆర్ పిలిపించారు. "నువ్వు ఏం చేసినా మద్దతు ఇస్తా.. అయితే శశికళను మాత్రం నీ వద్ద ఉంచుకోవద్ద"ని ఎంజీఆర్ జయలలితను హెచ్చరించారు.

Revealed: MGR warned Jayalalithaa about sasikala

శశికళ జయలలితను కీలుబొమ్మగా మార్చేశారనే విషయం అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీకి కూడా చేరింది. దాంతో రాజీవ్ గాందీ ఓ తమిళ కాంగ్రెసు నేతతో శశికళతో స్నేహం చేయవద్దని జయలలితకు చెప్పించారు. శశికళకు సంబంధించిన వివరానలు తిరునావుక్ర్కసర్ చివరి రోజుల్లో ఎంజీఆర్‌కు అందించారు. అయినా, వారిద్దరి మధ్య బంధం తెగలేదు.

కాగా, వడుకంపట్టి ధర్మరాజు అప్పట్లో శశికళ జ్యోతిష్కుడిగా ఉన్నారు. ఆయన మాటలనే శశికళ విశ్వసించేవారు. శశికళ ముఖ్యమంత్రి అవుతారని ఆయన ఓ సందర్భంలో అన్నారని సమాచారం. ఇది నిజమైనా అంటూ శశికళ పలువురు జ్యోతిష్కులను సంప్రదించారని చెబుతున్నారు. అందుకే శశికళ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడానికి దూకుడుగా ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు.

English summary
According the essay writen by Valampuri John - MGR warned Jayalalithaa about Sasikala at his last days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X