Revenge: భార్యకు విడాకులు, నచ్చిన లేడీతో ఎంజాయ్, అర్దరాత్రి ఫ్రెండ్ ఇంటి పక్కన ?, ఫినిష్ !
చెన్నై/ సేలం: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు, దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. దంపతుల మద్య 13 ఏళ్ల వయసు తేడా ఉంది. గొడవల కారణంగా దంపతులు విడిపోయారు. డ్రైవర్ గా పని చేస్తున్న భర్త మద్యం తాగడానికి బానిస అయ్యాడు. రాత్రి పీకలదాక మద్యం సేవించి రాత్రి వేరేవాళ్ల ఇంటి దగ్గర ఉన్న భర్త దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. భర్త హత్యకు గురైనాడని తెలిసినా అతని భార్య అటువైపు కన్నెత్తికూడా చూడకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోందని భర్త కుటుంబ సభ్యులు, స్నేహితులు అంటున్నారు.

కొన్ని సంవత్సరాలు దంపతులు హ్యాపీ
తమిళనాడులోని సేలం జిల్లా ఓమలూరు సమీపంలోని కంచనాయకనపట్టి పంచాయితీలోని ఉమాకొండంపట్టిలో సెంథిల్ కుమార్ అలియాస్ సెంథిల్ (43) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 10 సంవత్సరాల క్రితం సంగీత (30) అనే మహిళతో సెంథిల్ కుమార్ వివాహం జరిగింది. వివాహం చేసుకున్న సెంథిల్ కుమార్, సంగీత దంపతులు కొన్ని సంవత్సరాలు మాత్రమే సంతోషంగా కాపురం చేశారు,

దంపతుల మద్య 13 ఏళ్లు తేడా
సెంథిల్ కుమార్, సంగీత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సెంథిల్ కుమార్, సంగీత దంపతుల మద్య 13 ఏళ్ల వయసు తేడా ఉంది. కొంతకాలం నుంచి సంగీత, సెంథిల్ కుమార్ దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. గత ఏడాది సెంథిల్ కుమార్ అతని భార్య సంగీత, పిల్లలను వదిలేసి ఒంటరిగా ఉంటున్నాడు.

నచ్చిన ఆడదానితో ఎంజాయ్
భర్తకు దూరంగా సంగీత ఆమె పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నది. టెంపో డ్రైవర్ అయిన సెంథిల్ కుమార్ ప్రతిరోజు మద్యం సేవిస్తూ పేకాట ఆడుతూ నచ్చిన ఆడదానితో ఎంజాయ్ చేస్తున్నాడు. ఎప్పటిలాగే రాత్రి మద్యం సేవించిన సెంథిల్ కుమార్ రాత్రి స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. స్నేహితుడి ఇంటి దగ్గర సెంథిల్ కుమార్ మద్యం సేవించాడు.

ఎందుకు చంపేశారు ?
అర్దరాత్రి దాటిన తరువాత సెంథిల్ కుమార్ ను దారుణంగా చంపేశారు. ఉదయం సెంథిల్ కుమార్ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. సెంథిల్ కుమార్ ను పాతకక్షల కారణంగా హత్య చేశారా ?, డబ్బు కోసం హత్య చేశారా ? లేడా లేడీస్ విషయంలో హత్య చేశారా ? అనే విషయం కచ్చితగా తెలీయడం లేదని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.