షాక్: పెట్రోల్, డీజిల్ జిఎస్టీ పరిధిలోకి చేర్చకపోవచ్చు, ఎందుకంటే
పెట్రోల్, డీజిల్‌లు జిఎస్టీ పరిధిలోకి వస్తే ధరలు బాగా తగ్గుతాయి. కానీ ఈ పరిధిలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
Recommended Video

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌లు జిఎస్టీ పరిధిలోకి వస్తే ధరలు బాగా తగ్గుతాయి. కానీ ఈ పరిధిలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
పెట్రోల్, డీజిల్‌ను కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇది నెరవేరేలా కనిపించడం లేదు.

జిఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వాలు నో
జిఎస్టీ పరిధిలోకి పెట్రోలు, డీజిల్ రావాలన్న డిమాండ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించే అవకాశం కనిపించడం లేదు. ఒకవేళ దీనికి అంగీకారం తెలిపితే బెంగళూరులో వీటి ధర సగానికి తగ్గిపోతుంది. అత్యధిక శ్లాబ్ అయిన 28 శాతం పన్ను విధించినప్పటికీ భారీగా ధర తగ్గుతుంది.రూ.44.04 పైసలకు వస్తుంది. 12 శాతం విధిస్తే రూ.38.49కి వస్తుంది.

ఇది బంగారు బాతు
జిఎస్టీ కౌన్సిల్ వీటిని జిఎస్టీ విధించే వస్తువుల జాబితాలో చేర్చింది. కానీ పన్ను విధింపు అమల్లోకి రాలేదు. ఈ నేపథ్యంలో బంగారు బాతులాంటి పెట్రోలియం ఉత్పత్తులపై ఆదాయాన్ని కోల్పోయే స్థితిలో ప్రభుత్వాలు లేవు.

యాభై శాతం ఆదాయం కోల్పోతాయి
కర్ణాటక ప్రభుత్వానికి పెట్రోలియం ఉత్పత్తులపై పన్ను వల్ల నెలకు రూ.1,000 కోట్ల వరకు ఆదాయం లభిస్తోంది. దీనిని వదులుకోవడానికి ఆ ప్రభుత్వం ఇష్టపడటం అసాధ్యం. పెట్రోలుపై సెంట్రల్ ఎక్సైజ్ 67.54 శాతం, కర్ణాటక ప్రభుత్వం విధించే అమ్మకపు పన్ను 30 శాతం వసూలు చేస్తారు. ఒకవేళ దీనిని జిఎస్టీ పరిధిలోకి తెస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతానికి పైగా ఆదాయాన్ని కోల్పోతాయి.

కేంద్రమంత్రి ప్రతిపాదిస్తున్నప్పటికీ..
పెట్రోలు, డీజిల్‌లపై ప్రవేశ పన్నును రద్దు చేయడం వల్ల జూలైలో కర్ణాటక ప్రభుత్వం రూ.200 కోట్లు నష్టపోయింది. కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పెట్రోలు, డీజిల్‌లను జిఎస్టీ పరిధిలోకి తేవాలని ప్రతిపాదించినప్పటికీ, ఆచరణ సాధ్యం కాకపోవచ్చుని అంటున్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications