హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Highalert: దెబ్బకు ఆ సిటీలో హై అలర్ట్, ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం నుంచి వస్తే ?, సీరియస్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/హుబ్బళి: కర్ణాటకలోని మంగళూరులో కుక్కర్ బాంబు పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. మంగళూరులో అనుమానిత ఉగ్రవాది మోహమ్మద్ షారిఖ్ అలియాస్ షారిఖ్ బాంబు పేలుడుకు పెద్ద స్కెచ్ వేశాడని వెలుగు చూసింది. షారిఖ్ వెనుక చాలా మంది ఉన్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంగళూరు బాంబు పేలుడు తరువాత కర్ణాటక పోలీసులు అప్రమత్తం అయ్యి అన్ని సిటీల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర నుంచి వస్తున్న అన్ని వాహనాలను పరిశీలిస్తున్నారు.

Cheating: బెంగళూరు బ్యూటీ, చెన్నై చిన్నోడు, నా భర్త కస్టమ్స్ ఆఫీసర్ ?, రూ. 68 లక్షలు ఫట్ !Cheating: బెంగళూరు బ్యూటీ, చెన్నై చిన్నోడు, నా భర్త కస్టమ్స్ ఆఫీసర్ ?, రూ. 68 లక్షలు ఫట్ !

మొత్తం రివర్స్ అయ్యింది

మొత్తం రివర్స్ అయ్యింది

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందిన మోహమ్మద్ షారిఖ్ అలియాస్ షారిఖ్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు రావడం కలకలం రేపింది. కర్ణాటకలోని మంగళూరు సిటీలోని గెరోడియ ప్రాంతంలో ఆటోలో షారిఖ్ కుక్కర్ బాంబు తీసుకు వెలుతున్న సమయంలో మార్గం మద్యలోనే ఒక్కసారిగా పేలిపోయింది.

శివుడి గుడి టార్గెట్ చేశాడా ?

శివుడి గుడి టార్గెట్ చేశాడా ?


మంగళూరులో జరిగిన కుక్కర్ బాంబు పేలుడు కేసు ఊహించని మలుపు తిరుగుతోంది. మంగళూరులోని కద్రి దేవాలయాన్ని టార్గెట్ చేసుకున్నారని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కద్రి మంజునాథేశ్వర దేవాలయం ఈవో జయమ్మ మంగళూరు సిటీ పోలీసుకు ఫిర్యాదు చేసి ఆ దేవాలయం దగ్గర భద్రత కల్పించాలని మనవి చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

హుబ్బళి దారవాడలో హై అలర్ట్

హుబ్బళి దారవాడలో హై అలర్ట్

మంగళూరు కుక్కర్ బాంబు పేలుడు తరువాత హుబ్బళి-ధారవాడ జంట నగరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని జంట నగరాల పోలీసు కమీషనర్ లాబూరామ్ శుక్రవారం మీడియాకు చెప్పారు. హుబ్బళి, ధారవాడ జంట నగరాల్లోని సున్నితమైన ప్రాంతాల్లో నిఘా వేశామని పోలీసు కమీషనర్ లాబూరామ్ అన్నారు, మొత్తం మీద మంగళూరు బాంబు పేలుడు తరువాత కర్ణాటక పోలీసులు అప్రమత్తం అయ్యి అన్ని సిటీల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

English summary
Reverse: Mangaluru bombl blast case, Hubli city is on highalert.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X