వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యప్రదేశ్‌లో బీజేపీకి రివర్స్ పంచ్... కాంగ్రెస్‌లో చేరేందుకు మరో 4గురు బీజేపీ ఎమ్మెల్యేలు రెఢీ...

|
Google Oneindia TeluguNews

దేశమంతా పలు రాష్ట్రాల్లో బీజేపీ గాలీ వీస్తూంటే మధ్య ప్రదేశ్‌లో ఇందుకు భిన్నంగా ఉంది. కర్ణాటక సంక్షోభంతో అలర్ట్ అయిన మధ్యప్రదేశ కాంగ్రెస్ పార్టీ తమ రాష్ట్రంలో ఆపరేషన్ కమల్‌కు చేక్‌పెట్టింది. బీజేపీ ఆకర్ష్‌కు గురి కాకుండా తమ ఎమ్మెల్యేలను కాపాడుకుంటున్న కాంగ్రెస్ బీజేపీ ఎమ్మెల్యేలను సైతం పార్టీలో చేర్చుకుని ఆ పార్టీకి షాక్ ఇస్తోంది.ఇప్పటికే ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న కమల్ నాథ్ మరో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు స్కెచ్ వేశాడు.

మధ్యప్రదేశ్‌లో అలర్ట్ అయిన కాంగ్రెస్,

మధ్యప్రదేశ్‌లో అలర్ట్ అయిన కాంగ్రెస్,

కర్ణాటక సంక్షోభంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. నాలుగు రాష్ట్రాల్లో ఉన్న తమ అధికారాన్ని పదిలపరుచుకునేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో బాగంగా తాము అధికారంలో ఉన్న మధ్య ప్రదేశ్‌లో బీజేపీ కంటే ఓ అడుగు ముందుకు వేసి తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు వ్యూహాలు పన్నుతోంది. ఈనేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకుంటుంది. ముఖ్యంగా బీజేపీ హైకమాండ్ ఆదేశిస్తే 24 గంటల్లోనే ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. బీజేపీ నేతల ప్రకటన వెలువడిన కాసేపటికే ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ఆపార్టీ షాక్ ఇచ్చారు.

బీజేపీకి రివర్స్ పంచ్,

బీజేపీకి రివర్స్ పంచ్,

ఈనేపథ్యంలోనే బీజేపీకి చెందిన నారాయణ్ త్రిపాఠి, శరద్ కోల్ అనే ఎమ్మెల్యేలు తాము కాంగ్రెస్ పార్టీలో చేరతామని ప్రకటించారు. అంతకు ముందే త్రిపాఠి కాంగ్రెస్ నేత సురేశ్ పచౌరిని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా అసెంబ్లీలో ఈ ఇద్దరూ ఎమ్మెల్యేలు వ్యవహరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్రిమినల్ లా చట్టానికి ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతు పలికారు.

ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి

ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి

ఇద్దరు ఎమ్మెల్యేలు చేరిన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇండోర్ ఎంపీ కంప్యూటర్ బాబా కీలక వ్యాఖ్యలు చేశారు. మరో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని ప్రకటించారు. వారిని సీఎం కమల్‌నాథ్ ఆదేశిస్తే మీడియా ముందుకు తీసుకువస్తానని చెప్పారు. వారిని ఎప్పుడడంటే అప్పుడు ప్రజల ముందుకు తీసుకువస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మధ్యప్రదేశ్‌లో ఆపరేషన్ కమల్ రివర్స్ అవుతోంది.

అంసతృప్త నేతల బుజ్జగింపు...

అంసతృప్త నేతల బుజ్జగింపు...

ఈ నేపథ్యంలోనే నేతల మధ్య యూనిటి కోసం సీఎం కమల్‌నాథ్, మంత్రులు, పార్టీ కీలక నేతలతో పాటు ఎమ్మెల్యేలతో లంచ్ సమావేశాన్ని ఎర్పాటు చేశారు. కాగా ఈ సమావేశానికి జ్యోతిరాధిత్య సింధియాతోపాటు మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌లు పాల్గోన్నారు. అనంతరం ప్రత్యేకంగా జ్యోతిరాధిత్య సింధియా, ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌లు సైతం ఓ మంత్రి నివాసంలో డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇద్దరు నేతల మధ్య విభేదాలు లేవనే సంకేతాలను ఇచ్చారు. .

మధ్యప్రదేశ్‌లో పార్టీల బలబలాలు..

మధ్యప్రదేశ్‌లో పార్టీల బలబలాలు..

ఇక మధ్యప్రదేశ్‌లో జరిగిన 2018లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 230 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ స్వంతగా 114 స్థానాలను గెలుచుకోగా, ఎస్పీ,బీఎస్పీలతోపాటు ఇండిపెండెంట్‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ బలాబలాలను చూస్తే కాంగ్రెస్ పార్టీకి 114, బీఎస్పీకి 2 స్థానాలు, ఎస్పీ ఒక్క స్థానం,నలుగురు ఇండిపెండెంట్‌లతో కలిసి మొత్తం 121 మంది సభ్యులు ఉన్నారు.కాగా మెజారిటికి అయిదుగురు సభ్యులు మాత్రమే ఎక్కువగా ఉన్నారు. కాగా బీజేపీకి 108 స్థానాలు ఉన్నాయి. కాగా ఒక స్థానం ఖాలీగా ఉంది.

English summary
Computer Baba, in Indore, MP says Four BJP MLAs are in contact with me, when the time is right I'll present them before everyone. When CM Kamal Nath tells me, I'll present them before all. They (4 BJP MLAs) are in contact with me & are expecting that they be included in govt.he announced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X