వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్...! ముస్లిం లా బోర్డు సంచలన నిర్ణయం ....!!

|
Google Oneindia TeluguNews

అయోధ్య తీర్పుపై ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు యూ టర్న్ తీసుకుంది. అయోధ్య వివాదంపై తీర్పు వెలువడిన రివ్యూ పిటిషన్ వేయమని ప్రకటించిన బోర్డు తిరిగి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో పాటు అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం అయిదు ఎకరాలు కూడ తీసుకునేందుకు నిరాకరించించింది.

యూ టర్న్ తీసుకున్న ముస్లిం పర్సనల్ లా బోర్డు

యూ టర్న్ తీసుకున్న ముస్లిం పర్సనల్ లా బోర్డు

అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును చర్చించేందుకు ముస్లిం పర్సనల్ లాబోర్డు లక్నోలో సమావేశం అయింది. ఈ నేపథ్యంలోనే హజరైన కమిటీ సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. మరోవైపు మసీదు నిర్మాణం కోసం అయిదు ఎకరాల భూమిని ఇవ్వాలన్న సుప్రీం నిర్ణయాన్ని కూడ బోర్డు వ్యతిరేకించింది. ముఖ్యంగా... తీర్పు ద్వార తమకు సరైన హక్కు లభించపోవడంతో పాటు కనీసం తమ వాదనలకు కూడ గౌరవం ఇవ్వలేదని బోర్డు భావించినట్టుగా తెలిపారు. ఈ నేపథ్యంలోనే రివ్యూ పిటిషన్‌కు వెళ్లాలని నిర్ణయించినట్టు చెప్పారు. కాగా ఈ సమావేశానికి ఎమ్ఐఎమ్ అధినేత ,ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ కూడ పాల్గోన్నారు.

తీర్పు అనంతరం సానుకూల స్పందన

తీర్పు అనంతరం సానుకూల స్పందన

ముఖ్యంగా తీర్పు వెలువడిన రోజున వివిధ ముస్లిం నేతలు తీర్పును వ్యతిరేకించలేదు. ఈ నేపథ్యంలోనే మసీదు వ్యవహారంలో కీలకంగా వ్వవహరించిన ముస్లిం పర్సనల్ లాబోర్డు తీర్పుపై సమీక్షిస్తామని ప్రకటించింది. ఇక తీర్పుపై రివ్యూ పిటిషన్‌కు వెళ్లమని లా బోర్డు సభ్యులు స్పష్టం చేశారు. అయితే మరికొంతమంది నేతలు మాత్రం సుప్రీం తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అసదుద్దిన్ ఓవైసీ లాంటీ వారు తీర్పుపై అసంతృప్తిని వ్యక్తం చేయగా...సుప్రీం కోర్టు అత్యున్నత న్యాయస్థానమే అయినా... అది తమకు సరైన న్యాయం కల్పించలేదని ఆయన వ్యాఖ్యానించారు.

ఏకాభిప్రాయంతో తీర్పు

ఏకాభిప్రాయంతో తీర్పు

అయోధ్య తీర్పు నేపథ్యంలో సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ రంజన్‌ గొగొయ్ అధ్యక్షత అయిదుగురు సభ్యుల న్యాయమూర్తుల బృందం సుదీర్ఘంగా విచారించింది. నలబై రోజుల పాటు ఏకదాటిన విచారించిన ధర్మాసనం ఏకాభిప్రాయంతో తీర్పును ఇచ్చారు. గతంలో ఎప్పుడు లేనట్టుగా ఏకాభిప్రాయంతో తీర్పు వెలువరించడంతో మెజారీటీ పార్టీలు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీర్పును స్వాగతించారు. దీంతో అంతా సమసిపోయిందని భావించిన తరుణంలో ఈ పరిణామం చోటుకోవడం వివాదం మళ్లి మొదటికి వస్తుందా అనే అనుమానాలు రేకెత్తున్నాయి...

పిటీషన్ స్వీకరణపై అనుమానాలు

పిటీషన్ స్వీకరణపై అనుమానాలు

అయితే చీఫ్ జస్టీస్‌తో పాటు అయిదుగురు సభ్యులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఏకాభిప్రాయంతో తుది తీర్పును వెలువరించింది. అయితే ఇంత కసరత్తు చేసి తీర్పును వెలువరించిన ధర్మాసనం రివ్యూపిటిషన్‌ను స్వీకరిస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. కాగా ఇదే అభిప్రాయాన్ని ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడ వ్యక్తపరిచింది. సుప్రీం పటిషన్‌ తీసుకుంటుందా లేదా అనే దానికంటే తమ హక్కుల కోసం తిరిగి రివ్యూ పిటీషన్ వెయాలని నిర్ణయించినట్టు జమాతే ఉలేమా హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మీడియాకు వెల్లడించారు. ఒకవేళ పిటిషన్ స్వీకరిస్తే మాత్రం మరో కొద్ది రోజుల పాటు మందిర నిర్మాణానికి బ్రేకులు పడక తప్పదు.

English summary
All India Muslim Personal Law Board decides to file review petition against Supreme Court’s Ayodhya verdict.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X