వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మే నుండి ప్రతి రోజూ పెట్రోల్, ఢీజీల్ ధరల మార్పు, 5 మెట్రో సిటీలివే

దేశంలోని ఐదు మెట్రో నగరాల్లో ప్రతిరోజూ పెట్రోల్, డీజీల్ ధరలు మారనున్నాయి.ఈ ఏడాది మే 1వ, తేది నుండి ఈ విధానం అమల్లోకి తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు కొత్త ఇంధన విధానాన్ని

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలోని ఐదు మెట్రో నగరాల్లో ప్రతిరోజూ పెట్రోల్, డీజీల్ ధరలు మారనున్నాయి.ఈ ఏడాది మే 1వ, తేది నుండి ఈ విధానం అమల్లోకి తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు కొత్త ఇంధన విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు.అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

దేశ వ్యాప్తంగా ఐదు నగరాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తోంది కేంద్రం. ఈ మేరకు ఐదు నగరాలను ఎంపిక చేసింది కేంద్రం. దక్షిణాదికి చెందిన పాండిచ్చేరి , విశాఖ నగరాలను కేంద్రం ఎంపిక చేసింది. ఉదయ్ పూర్, జంషెడ్ పూర్, ఛంఢీఘడ్ ప్రాంతాల్లో ప్రతి రోజూ పెటోల్ , డీజీల్ ధరల్లో మార్పులు చేయనున్నారు.

Revise Petrol, diesel prices daily in metro cities

ఆ రోజు అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధర ఆధారంగా పెట్రోల్, డీజీల్ ధరలను నిర్ణయించనున్నారు. ప్రస్తుతం ప్రతి 15 రోజులకు ఓ సారి పెట్రోల్, డీజీల్ ధరలను సమీక్షంచనున్నారు.అయితే కొత్త విధానాన్ని అమలు చేయడం వల్ల ఏ రోజుకు ఆ రోజే అంతర్జాతీయ మార్కెట్ కు ధరలకు అనుగుణంగా నిర్ణయించనున్నారు.

దేశంలోని 90 శాతం ఆయిల్ రిటైల్ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, భారత్ పెట్రోలియం కార్పోరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లు కలిగి ఉన్నాయి. ఈ మూడు సంస్థలు అమలు చేయాలనుకొన్న నగరాల్లో సుమారు 200 పెట్రోల్ బంక్ లున్నాయి.

English summary
India’s state-run oil marketing companies plan to revise retail fuel prices everyday, beginning with five cities across the country, to better shield themselves from volatility in global crude oil prices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X