• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

LJP ముసలం: గాయపడ్డ సింహం బిడ్డను -బాబాయి పశుపతికి BJP అండపై Chirag Paswan విస్మయం

|

రాంవిలాస్ పాశ్వాన్ చనిపోయిన ఆరు నెలలకే లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) కకావికలం అయింది. పాశ్వాన్ కొడుకు చిరాగ్, తమ్ముడు పశుపతి పారస్ ల మధ్య ఆధిపత్య పోరు తలెత్తగా, కేంద్రంలోని బీజేపీ బాబాయికి అండగా నిలవడంతో అబ్బాయి డంగైపోయాడు. లోక్ సభలో నేతగా పశుపతిని గుర్తించడాన్ని తప్పుపడుతూ చిరాగ్.. స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఎల్జేపీలో తాజా పరిణామాలపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.

Etelaపై Jagan ఆగ్రహం -KCR బర్రెలు తినేవాడైతే నువ్వు గొర్రెలు తినే రకమంటూ -BJP, Modiపైనా ఫైర్Etelaపై Jagan ఆగ్రహం -KCR బర్రెలు తినేవాడైతే నువ్వు గొర్రెలు తినే రకమంటూ -BJP, Modiపైనా ఫైర్

స్పీకర్ తీరుపై విస్మయం

స్పీకర్ తీరుపై విస్మయం


ఎల్జేపీ పార్లమెంటరీ నేత పదవి కోల్పోయి, అటు పార్టీలోనూ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తొలగించబడిన యువనేత చిరాగ్ పాశ్వాన్ పోరు బాట పట్టారు. బాబాయి పశుపతి పారస్ తో అంతు తేల్చుకునేందుకు ఎంత దూరమైనా వెళతానని చెప్పారు. ఎల్జేపీలో జరిగిన, జరుగుతోన్న పరిణామాలపై చిరాగ్ ఘాటుగా స్పందించారు. పార్టీ నిబంధనల ప్రకారం జాతీయ అధ్యక్షుడే పార్లమెంటరీ నేతను నిర్ధారించాల్సి ఉండగా, దానికి విరుద్ధంగా రెబల్ ఎంపీలతంతా కలిసి పశుపతిని నేతగా ఎన్నుకోవడ, దాన్ని లోక్ సభ సైతం ధృవీకరించడం సరికాదని, దీనిపై స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశానని చిరాగ్ తెలిపారు. రెబల్ ఎంపీలపై మంగళవారం వేటేసిన ఆయన బుధవారం మీడియా ముందుకొచ్చారు..

షాకింగ్: కరోనాతో మరో సింహం మృతి -చెన్నైలోని వడలూర్ జూ పార్క్‌లో హైటెన్షన్ -రంగంలోకి సీఎం స్టాలిన్షాకింగ్: కరోనాతో మరో సింహం మృతి -చెన్నైలోని వడలూర్ జూ పార్క్‌లో హైటెన్షన్ -రంగంలోకి సీఎం స్టాలిన్

బాబాయి అడిగితే ఇచ్చేవాణ్ని

బాబాయి అడిగితే ఇచ్చేవాణ్ని


‘‘కుటుంబ విషయాలు నాలుగ్గోడల మధ్యే పరిష్కరించుకోవాలి. కానీ ఇందుకు భిన్నంగా జరుగుతోంది. ఈ పోరాటం చాలా కాలం పాటు కొనసాగేలా కనిపిస్తోంది. చట్టం ప్రకారమే పోరాడతాం. కొన్ని రోజులుగా నా ఆరోగ్యం బాగోలేదు. అందుకే బయటికి రాలేదు. ఒక్క మీడియా సమావేశంతో అంతా సర్దుబాటు కాదు. ఈ పోరాటం చాలా సుదీర్ఘమైంది'' అని చిరాగ్ అన్నారు. తనకు ఆరోగ్యం బాగా లేని సమయం చూసి, పార్టీలో ఇబ్బందులు సృష్టించడానికి ప్రణాళికలను రచించారని చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు, ఆ తర్వాత పార్టీని చీల్చడానికి జేడీయూ తీవ్రంగా ప్రయత్నించిందని, అయితే, బాబాయ్ పశుపతినాథ్ పదవి అడిగితే, తాను ఇచ్చేవాడినని, ఎల్జేపీ నేతగా నియమించేవాడినని చిరాగ్ పేర్కొన్నారు.

  Viral Video.. పక్షులపై ఏనలేని ప్రేమ చూపిస్తున్న ఓ వ్యక్తి కథ !
  సింహం బిడ్డను.. గాయపడ్డా..

  సింహం బిడ్డను.. గాయపడ్డా..


  తాను రాంవిలాస్ పాశ్వాన్ కొడుకునని, సింహం బిడ్డనని, గాయపడినప్పటికీ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటానని చిరాగ్ ప్రకటించారు. తండ్రి రాంవిలాస్ పాశ్వాన్ మరణించిన కొన్ని రోజులకే ఎన్నికలు వచ్చాయని, వాటిని ఎదుర్కోవడం కాస్త ఇబ్బందిగా మారిందని గుర్తు చేసుకున్నారు. అయినా ప్రజలు తమ పార్టీని ఆదరించారని, 25 లక్షలకు పైగా ఓట్లు తమకు వచ్చాయని చిరాగ్ తెలిపారు. జేడీయూ కారణంగానే తాము ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాల్సి వచ్చిందని, జేడీయూ కారణంగానే తాము ఒంటరిగా బరిలోకి దిగామని వెల్లడించారు. సీఎం నితీశ్ విధానాలను తాను ఏనాటికీ ఒప్పుకోనని, ఎవరి ముందూ తలవంచుకోవద్దని తాను నిర్ణయించుకున్నానని, అందుకే ఒంటరిగా బరిలోకి దిగానని వెల్లడించారు. ఎన్నికల సమయంలోనూ కొందరు పోరాటం చేయలేదని, బాబాయ్ పశుపతినాథ్ ఎన్నికల సమయంలో ఎలాంటి భూమికా పోషించలేదని చిరాగ్ మండిపడ్డారు.

  English summary
  Chirag Paswan, fighting for survival after a coup in the Lok Janshakti Party (LJP) led by his uncle, said today that he was ready for a legal fight against the rebel group, declaring that he was "the son of Ram Vilas Paswan, a sher ka bachcha". Lok Janshakti Party leader Chirag Paswan has contested Lok Sabha Speaker Om Birla's decision to name Pashupati Kumar Paras as the leader of the party in the House, saying it is "contrary" to provisions of his organisation.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X