వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటీని వణికించిన సత్యం స్కాం: వెలుగు చూసిందిలా, కేసు ఇలా

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఐదేళ్ల క్రితం... దేశవ్యాప్తంగా సంచలనం రేపిన, ఐటీ సంస్థలకు వణుకు పుట్టించిన సత్యం కుంభకోణంలో రామలింగ రాజును, మరో తొమ్మిది మందిని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా పేర్కొంటూ గురువారం నాడు తీర్పు చెప్పింది. భారత ఐటీ రంగంలో విప్లవంలా దూసుకు వచ్చిన రామలింగ రాజు ఇమేజ్ అంతే వేగంగా తగ్గిపోయింది. సత్యం కుంభకోణం ఆయన ప్రతిష్టను పాతాళానికి దిగజార్చింది.

సత్యం రామలింగ రాజు లేని లాభాలను ఉన్నట్టుగా చూపించారు. ఉద్యోగుల సంఖ్యను ఎవరికీ అనుమానం రాకుండా పెంచి వాటాదారులను కూడా మోసం చేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత... చివరకు తానే తప్పు అంగీకరించి షేర్ హోల్డర్లకు లేఖ రాశారు. అప్పటి వరకు సత్యం కుంభకోణం బయటకు రాలేదు.

2009 జనవరి 7వ తేదీన రామలింగ రాజు తప్పును అంగీకరిస్తూ షేర్ హోల్డర్లకు లేఖ రాశారు. ఏడువేల కోట్లకు పైగా అవతవకలు జరిగినట్లు అంగీకరిస్తూ లేఖ రాశారు. లేని లాభాలను ఉన్నవిగా చూపించానని, సంస్థ విలువను పెంచానని తెలిపారు.

దీంతో హైదరాబాదుకు చెందిన వాటాదారు లీలా మంగత్ ఫిర్యాదుతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసును సీబీఐకి అప్పగించారు. రామలింగ రాజు, ఆయన సోదరులు రామరాజు, వడ్లమాని శ్రీనివాస్ తదితరులను అరెస్టు చేసి జైలుకు పంపించారు.

రామలింగ రాజు రెండున్నర నుండి మూడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. అనంతరం జైలు నుండి విడుదలయ్యారు. ఆయన అనారోగ్యం పేరు చెప్పి జైలు నుండి బయటకు వచ్చారు. ఆరు నెలల క్రితం ఈ కేసు పైన వాదనలు పూర్తయ్యాయి. గురువారం నాడు సీబీఐ ప్రత్యేక కోర్టు అతనిని దోషిగా తేల్చింది. అతనికి జైలు శిక్షను ఈ రోజు లేదా రేపు ఖరారు చేయవచ్చునని అంటున్నారు.

Rewinding Satyam fraud case: Timeline

జనవరి 7, 2009 - రూ.ఏడువేల కోట్ల ఫ్రాడ్ అయినట్లు చెప్పిన రామలింగ రాజు
జనవరి 8, 2009 - బ్యాంకులలోని 30 అకౌంట్లు ఫ్రీజ్ చేశారు.
జనవరి 9, 2009 - సత్యం సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నుండి తొలగించబడింది.
జనవరి 9, 2009 - సీఐడీ కేసు నమోదు చేసింది. అదే రోజు రామలింగ రాజు అరెస్ట్
జనవరి 10, 2009 - శ్రీనివాస్ వడ్లమూడి అరెస్ట్
జనవరి 11, 2009 - దీపక్ పరేఖ్, కిరణ్ కార్నిక్, అచుతన్‌లను ప్రభుత్వం సత్యం బోర్డు మెంబర్స్‌గా నియమించింది.
ఫిబ్రవరి 2009 - సీబీఐ కేసు నమోదు చేసి, అనంతరం మూడు ఛార్జీషీట్లు దాఖలు చేసింది.
ఏప్రిల్ 22, 2009 - సత్యం కంపెనీని టెక్ మహింద్రా టేకోవర్ చేసింది.
జూన్ 22, 2009 - మహీంద్రా సత్యం - మహింద్ర సత్యం న్యూ బ్రాండ్ విడుదల చేసింది.
నవంబర్ 2, 2011 - సుప్రీం కోర్టు సత్యం రామలింగ రాజుకు బెయిల్
అక్టోబర్ 28, 2013 - ఈడీ ఛార్జీషీట్ ఫైల్ చేసింది.
డిసెంబర్ 23, 2014 - సత్యం కేసు వాయిదా
మార్చి 9, 2015 - ఏప్రిల్ 9కి వాయిదా
ఏప్రిల్ 9, 2015 - రామలింగ రాజు సహా పది మందిని నిందుతులుగా తేల్చిన కోర్టు

English summary
Today's verdict in a special court has nailed the coffin of the 6-year old Satyam fraud case. While the case has kept both investigators and investors on their toes, the 3,000 pager document and 226 witnesses finally proved that the stalwarts were responsible for cheating and deceiving common man.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X