వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రగ్స్‌ కేసులో కేసులో రియా చక్రవర్తి అరెస్టు- వైద్యపరీక్షలకు తరలింపు..

|
Google Oneindia TeluguNews

ముంబైలో బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ ఆత్మహత్య అనంతరం ఈ వ్యవహారానికి దారి తీసిన డ్రగ్స్‌ కేసులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో అధికారులు ఇవాళ అరెస్టు చేశారు. సుశాంత్‌కు డ్రగ్స్‌ సరఫరా చేసిన వ్యవహారంలో మూడు రోజులుగా ఆమెను ప్రశ్నిస్తన్న ఎన్‌సీబీ అధికారులు కొద్దిసేపటి క్రితం ఆమెను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. వెంటనే ఆమెను వైద్య పరీక్షలకు తరలించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి రిమాండ్‌ కోరనున్నారు. ఆ తర్వాత కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారణ జరిపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Recommended Video

Rhea Chakraborty: బ్రేకింగ్ న్యూస్.. సుశాంత్‌ కేసులో ఎదురుదెబ్బ, రియాను అరెస్ట్ చేసిన NCB | Oneindia

సుశాంత్‌తో పాటు బాలీవుడ్‌లో మరికొందరికి డ్రగ్స్‌ సరఫరా చేసిన కేసులో రియా, ఆమె సోదరుడు షోవిక్‌తో పాటు మరో ఇద్దరిని విచారించిన ఎన్‌సీబీ.. నలుగురినీ తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరబోతోంది. వీరిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత డ్రగ్స్‌ దందాకు సంబంధించిన మరిన్ని వివరాలను రాబట్టేందుకు ఎన్‌సీబీ ప్రయత్నిస్తోంది.

rhea chakraborty arrested by ncb in sushant case, taken for medical test

సుశాంత్ మృతి కేసులో ఇప్పటికే రియా సోదరుడు షోవిక్‌ చక్రవర్తిని సైతం ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. విచారణలో రియా 25 మంది బాలీవుడ్‌ ప్రముఖుల పేర్లను ఎన్‌సీబీ అధికారులకు వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో వీరికి నోటీసులు జారీ చేసేందుకు ఎన్‌సీబీ సిద్దమవుతోంది. పది రోజుల్లో నోటీసులు జారీ చేస్తామని అధికారులు తెలిపారు.

మరోవైపు రియా అరెస్టుపై స్పందించిన సుశాంత్‌ సోదరి శ్వేతా సింగ్‌ దేవుడు తమకు అండగా ఉన్నాడని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ఈ కేసులో తన సోదరుడి ఆత్మకు శాంతి జరగాలంటే రియాతో పాటు మిగిలిన వారికి కూడా శిక్ష పడాలని ఆమె ఎప్పటి నుంచో కోరుతున్నారు.

English summary
Narcotics Control Bureau arrests Rhea Chakrabarty today under various sections of NDPS. She will be taken for a medical test.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X