చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమ్యూజ్‌మెంట్ పార్కులో ప్రమాదం... కుప్పకూలిన ఫ్రీఫాల్ టవర్

|
Google Oneindia TeluguNews

చెన్నై: చెన్నైలోని ఆటవిడుపు కేంద్రంలో స్పల్ప ప్రమాదం చోటుచేసుకుంది. క్వీన్స్‌ల్యాండ్ అమ్యూస్‌మెంట్ పార్క్‌లో ఫ్రీఫాల్ టవర్‌ అనేదాంట్లోకి కొందరు ఎక్కారు. అంత ఎత్తునుంచి ఒక్కసారిగా అది కిందకు పడిపోవడంతో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. పెద్ద స్తంభానికి ఇరువైపుల మనుషులు కూర్చునేందుకు రెండు బెంచీలు ఉంటాయి. ఇక ఆ రెండు బెంచీలను పైకి తీసుకెళుతారు. తిరిగి కిందకు తీసుకువస్తారు. ఇలా పెకి కిందికు తీసకువచ్చే క్రమంలో ప్రమాదం జరిగింది.

బెంచీలను ఒడిసి పట్టుకునే మెటల్ కేబుళ్లు తెగిపోవడంతో 10 అడుగుల ఎత్తునుంచి ఒక బెంచీ కిందకు పడిపోయింది. దీంతో అందులో ఉన్న మనుషులు ఒక్కసారిగా ఒకరిపైన ఒకరు పడిపోయారు. కింద ఉన్న వారు నలిగిపోవడంతో తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రస్తుతానికి అమ్యూజ్‌మెంట్ పార్కును అధికారులు మూసివేశారు.

Ride at Chennai theme park turns hazaradous, 12 injured after free fall tower collapsed

అమ్యూజ్‌మెంట్ పార్కులో ఎక్విప్‌మెంట్ సరిగ్గా లేదని మార్చాలని రెండు నెలల క్రితమే నోటీసులు ఇచ్చినట్లు అసిస్టెంట్ కమిషనర్ ముత్తువేల్ పాండి చెప్పారు. అయితే రైడ్లను చాలా సేఫ్‌గా జరుపుతామని నిర్వాహకులు గ్యారెంటీ ఇచ్చారని పోలీసులు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే పార్కు అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వలేదని వారు తెలిపారు.

తమ ఆనందం కోసం ఫ్రీ టవర్ ఫాల్‌ను ఎక్కిన వారు అదృష్టవంతులని.. కేవలం 10 అడుగుల ఎత్తునుంచే కిందకు పడ్డారని... ఒకవేళ పైకి వెళ్లిన సమయంలో కేబుళ్లు తెగిపడి ఉంటే భారీ ప్రాణనష్టం జరిగేదని అసిస్టెంట్ కమిషనర్ పాండి అన్నారు. ఇకపై సేఫ్టీ సర్టిఫికేట్లను సమర్పించాకే పార్కును తెరవాలని పోలీసు కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. డబ్బు కోసం చూసుకుని ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం సరికాదని వార్నింగ్ ఇచ్చారు. ఎలాంటి సురక్షితమైన జాగ్రత్తలు తీసుకోకుండా ఇలాంటివి నడపడం నేరమన్నారు.

English summary
A ride at a theme park attraction in Chennai turned hazardous for revellers on Thursday when one of the platforms collapsed to the ground, injuring at least 12 people.The ride, called the ‘Free Fall Tower’, at the Queensland Amusement Park plunged 10 feet to the ground after the steel cables holding the platform snapped. While those onboard suffered minor injuries, the theme park has been temporarily closed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X