వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్ను ఎత్తుకెళ్తారనుకోలేదు: సీఎం శివరాజ్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

భోపాల్‌: వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన తనపై వస్తున్న విమర్శలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. వరద నీటిని దాటించేందుకు భద్రతా సిబ్బంది సీఎం చౌహాన్‌ను ఎత్తుకుని తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎంపై పలువురు సోషల్ మీడియాలో విమర్శలతోపాటు జోకులు పేల్చారు.

ఈ నేపథ్యంలో సదరు ఘటనపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ ఎట్టకేలకు వివరణ ఇచ్చారు. 'పన్నాలో వరద నీటికి అవతలి వైపున్న చిన్న వంతెనపై గ్రామస్థులు ఉన్నారు. నేను వారిని కలుసుకునేందుకు అటు వైపుగా నడుస్తున్నాను. ఇంతలో సిబ్బంది నన్ను వారి చేతులతో ఎత్తి తీసుకెళ్లారు. ఏం జరుగుతుందో నేను గుర్తించి, స్పందించేలోగానే అంతా జరిగిపోయింది' అంటూ చౌహన్‌ వివరించారు.

వాళ్లు ఎత్తుకోబోతున్నారన్న విషయం కూడా తనకు తెలియదని చెప్పారు.పన్నా జిల్లాలో గత ఆదివారం వరద ప్రాంతాల పరిశీలనకు చౌహాన్‌ వెళ్లారు. ఈ సందర్భంగా ఓ కాలువ దాటే క్రమంలో చౌహాన్‌ను భద్రతా సిబ్బంది తమ చేతులతో ఎత్తుకుని కాలువ దాటించారు.

సీఎం శివరాజ్

సీఎం శివరాజ్

వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన తనపై వస్తున్న విమర్శలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు.

వరద ప్రభావం

వరద ప్రభావం

వరద నీటిని దాటించేందుకు భద్రతా సిబ్బంది సీఎం చౌహాన్‌ను ఎత్తుకుని తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎంపై పలువురు సోషల్ మీడియాలో విమర్శలతోపాటు జోకులు పేల్చారు.

వరద ప్రభావం

వరద ప్రభావం

ఈ నేపథ్యంలో సదరు ఘటనపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ ఎట్టకేలకు వివరణ ఇచ్చారు.

వరద ప్రభావం

వరద ప్రభావం

‘పన్నాలో వరద నీటికి అవతలి వైపున్న చిన్న వంతెనపై గ్రామస్థులు ఉన్నారు. నేను వారిని కలుసుకునేందుకు అటు వైపుగా నడుస్తున్నాను. ఇంతలో సిబ్బంది నన్ను వారి చేతులతో ఎత్తి తీసుకెళ్లారు. ఏం జరుగుతుందో నేను గుర్తించి, స్పందించేలోగానే అంతా జరిగిపోయింది' అంటూ చౌహన్‌ వివరించారు.

వరద ప్రభావం

వరద ప్రభావం

వాళ్లు ఎత్తుకోబోతున్నారన్న విషయం కూడా తనకు తెలియదని చెప్పారు.
పన్నా జిల్లాలో గత ఆదివారం వరద ప్రాంతాల పరిశీలనకు చౌహాన్‌ వెళ్లారు. ఈ సందర్భంగా ఓ కాలువ దాటే క్రమంలో చౌహాన్‌ను భద్రతా సిబ్బంది తమ చేతులతో ఎత్తుకుని కాలువ దాటించారు.

వరద ప్రభావం

వరద ప్రభావం

ఈ ఫొటో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారడంతో విపక్షాలతో పాటు, నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ విమర్శలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే మిశ్రా సోమవారం ఖండించారు.

వరద ప్రభావం

వరద ప్రభావం

ముఖ్యమంత్రికి ‘జెడ్‌' కేటగిరీ భద్రత ఉంటుందని.. ఆయనకు నీటిలో విషపూరిత జంతువుల నుంచి హానికలగకుండా రక్షించాల్సిన బాధ్యత భద్రతా సిబ్బందిపై ఉందని అందుకే వారు ఆయనను మోసుకెళ్లారని మిశ్రా పేర్కొన్నారు.

English summary
Social media was abuzz with Madhya Pradesh chief minister Shivraj Singh Chouhan's image while he was inspecting a flood-hit region in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X