వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెల్మెట్, లైసెన్స్ లేకుండా వెళ్తున్నారా?: అంతా బీహార్ పోలీసులే చూసుకుంటారు!

|
Google Oneindia TeluguNews

పాట్నా: వాహనదారులు కొత్తగా అమల్లోకి వచ్చిన మోటారు వాహనాల చట్టంతో రోడ్లపైకి రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఏ రకంగా ఫైన్ పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అందుకే రోడ్డుపైకి వచ్చేప్పుడే అన్ని పత్రాలు, హెల్మెట్, ఉన్నాయో సరిచూసుకుని బయటకు వస్తున్నారు.

ట్రాఫిక్ పోలీసులు కూడా భారీ చలాన్లతో వాహనదారులకు సింహ స్వప్నంలా కనిపిస్తున్నారు. అయితే, బీహార్ రాష్ట్రంలో మాత్రం ట్రాఫిక్ పోలీసులు ఒక్క అవకాశం అంటూ వాహనదారులకు స్నేహపూర్వకంగా ఉంటున్నారు. దీంతో వాహనదారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అంతా వాళ్లే చూసుకుంటారు..

అంతా వాళ్లే చూసుకుంటారు..

హెల్మెట్ లేకుండా చెక్‌పాయింట్ల వద్ద దొరికితే వారిని నేరుగా హెల్మెట్లు విక్రయించే దుకాణం వద్దకు తీసుకెళ్లి కొనుగోలు చేయిస్తున్నారు బీహార్‌లోని మోతీహరీ పట్టణంలోని ట్రాఫిక్ పోలీసులు. బీమా లేకపోతే సమీపంలోని బీమా సంస్థ వద్దకు పంపి పాలసీ కూడా చేయిస్తున్నారు.

ఇప్పుడు ఎలా పట్టుకుంటారు... హెల్మట్ చుట్టు ఆర్సీ,డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలు అంటించిన వ్యక్తి...ఇప్పుడు ఎలా పట్టుకుంటారు... హెల్మట్ చుట్టు ఆర్సీ,డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలు అంటించిన వ్యక్తి...

నేరస్తుల్లా కాదు..

నేరస్తుల్లా కాదు..

చెక్ పాయింట్ల పక్కనే బీమా చేయించేవారిని, హెల్మెట్ వ్యాపారులను ఉండేలా చూస్తున్నాము. వాహనదారులను నేరస్థుల్లా చూస్తూ వారికి నేరుగా జరిమానాలు విధించడం లేదని, వారు నాణ్యమైన హెల్మెట్లు కొనేట్లు, బీమాను రెన్యూవల్ చేయించుకునేట్లు చేస్తున్నామని స్థానిక స్టేషన్ అధికారి ముకేష్ చంద్ర కన్వర్ వివరించారు

వాహనదారుల సేఫ్టీ కోసమే..

వాహనదారుల సేఫ్టీ కోసమే..

అంతేగాక, లెర్నింగ్ లైసెన్స్ జారీ చేసే అధికారం ఉన్న ఒక అధికారిని కూడా తమకు కేటాయించాలని ఇప్పటికే జిల్లా రవాణా శాఖ అధికారిని కోరినట్లు ముకేష్ చంద్ర తెలిపారు. అర్హత ఉండి లైసెన్స్‌లు లేకుండా వాహనాలు నడిపేవారికి చెక్ పాయింట్ల వద్దే లెర్నింగ్ లైసెన్స్ ఇచ్చేందుకు వీలవుతుందని చెప్పారు. వాహనదారులు, ప్రజల క్షేమం కోసమే కొత్త మోటారు వాహనాల చట్టం అని ఆయన వివరించారు.

English summary
Under the new Motor Vehicles Act, amendments to which came into effect from this month, if you are caught riding a bike without a helmet you might be fined ₹1,000 along with a three-month disqualification from driving license.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X