వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్యాండిల్ వుడ్ హీరోలు సుదీప్, దర్శన్ వార్: అసహనంతో అభిమానులు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కన్నడ సినీ రంగంలో ఇద్దరు అగ్రహీరోలు ఇప్పుడు కత్తులు దూసుకుంటున్నారు. బహుబాషా నటుడు కిచ్చి సుదీప్, చాలెంజింగ్ స్టార్ దర్శన్ అభిమానులు మాటల యద్దంతో ఒకరి హీరోను ఒకరు బండబూతులు తిట్టుకుంటున్నారు.

తూగుదీప్ దర్శన్ చేసిన ట్వీట్ కు స్పందించడానికి కిచ్చ సుదీప్ నిరాకరించారు. కొన్ని సంవత్సరాల క్రితం సుదీప్ ఓ కన్నడ టీవీ చానల్ కు ఇంటర్వూ ఇస్తూ తాను మొదటి సారి దర్శన్ ను చాముండేశ్వరి స్టూడియోలో చూశానని చెప్పారు.

ఆ రోజు దర్శన్ క్లాప్ బోర్డు పట్టుకుని నిలుచుని ఉన్నాడని, అప్పటికే తాను హీరో అని సుదీప్ పరోక్షంగా చెప్పారు. స్యాండిల్ వుడ్ లో దర్శన్ ను మాస్ హీరోగా నిలబెట్టిన మెజస్టిక్ సినిమాలో నన్ను హీరోగా నటించమని దర్శకుడు సత్య మొదట తన దగ్గరకే వచ్చారని సుదీప్ అన్నారు.

 Rift Between Darshan and Sudeep Comes to Limelight Again and Darshan Revealed the Actual Reason Behind it.

అయితే తాను ఆ సినిమాలో నటించడానికి నిరాకరించడంతో మెజస్టిక్ సినిమాలో దర్శన్ హీరోగా నటించారని, దర్శన్ ను సూచించింది తాను అనే సుదీప్ చెప్పారని ఇటీవల ఓ వీడియో క్లిప్పింగ్ కన్నడ చానల్స్ లో పదేపదే ప్రసారం అవుతోంది.

ఈ విషయంపై దర్శన్ ఘాటుగానే స్పందించారు. ఈ విషయంలో నా మనస్సు దెబ్బతినింది, సుదీప్ క్లారిటీ ఇవ్వాలని దర్శన్ ట్వీట్ చెయ్యడంతో దూమరం చెలరేగింది. సుదీప్ నటించిన హుబ్బళి సినిమా ఇటీవల విడుదలై కలెక్షల పరంగా దూసుకుపోతోంది.

హుబ్బళి సినిమా ప్రచారం చేస్తూ సుదీప్ బిజీబిజీగా గడుపుతున్నారు. సోమవారం తుమకూరులో దర్శన్ చేసిన ట్వీట్ విషయంపై స్పంధించాలని మీడియా ప్రశ్నించగా సుదీప్ అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయారు.

ఈ విషయంపై మా హీరో గొప్ప అంటే కాదు మా హీరో గొప్ప అంటూ సుదీప్, దర్శన్ అభిమానులు ఒంటికాలి మీద నిలబడ్డారు. ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తోందో అంటూ స్యాండిల్ వుడ్ ప్రముఖులు కలవరపడుతున్నారు. అయితే వీరిద్దరి మద్య స్నేహం కట్ అవ్యడానికి వేరే కారణాలు ఉన్నాయని కన్నడ సినీ రంగానికి చెందిన పలువురు గుసగుసలాడుతున్నారు.

English summary
Rift Between Darshan and Sudeep Comes to Limelight Again and Darshan Revealed the Actual Reason Behind it. Here is the Reason Between Darshan and Sudeep Rift.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X