వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జేడీయూలో చీలిక: పౌరసత్వ సవరణ బిల్లు పై ప్రశాంత్ కిషోర్ అసంతృప్తి

|
Google Oneindia TeluguNews

పాట్నా: వివాదాస్పద పౌరసత్వ బిల్లు జేడీయూలో విబేధాలు సృష్టించింది. ముందునుంచి బిల్లుకు వ్యతిరేకమని చెబుతున్న జేడీయూ పార్టీ బిల్లుకు మద్దతు ఇస్తున్నామంటూ ఆదివారం ప్రకటించింది. దీనిపై జేడీయూ నేత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనతో పాటు మరో జేడీయూ సీనియర్ నేత పవన్ వర్మ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. బిల్లు చాలా వివాదాస్పదంగా ఉందని చెబుతూ దానికి పార్టీ మద్దతు ఇవ్వడాన్ని వారు వ్యతిరేకించారు.

లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు సోమవారం అర్థరాత్రి పాస్ అయిన సంగతి తెలిసిందే. బిల్లుకు అనుకూలంగా జేడీయూ పార్టీ ఎంపీలు ఓటు వేశారు. జేడీయూ వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటువేయగానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు జేడీయూ మద్దతు ఇవ్వడం నిరాశకు గురిచేసిందని ట్వీట్ చేశారు. మతప్రాతిపదికన ప్రజలకు పౌరసత్వం ఇవ్వడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు.

Rift in JDU as Prashant Kishor and Pawan varma oppose CAB

ఇదిలా ఉంటే మరో జేడీయూ సీనియర్ నేత మాజీ దౌత్యాధికారి పవన్ వర్మ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. రెండు వర్గాల మధ్య వివక్ష చూపుతోందని, దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఉందని చెప్పారు. జేడీయూ ఒక లౌకికత్వం ఉన్న పార్టీ అని చెప్పిన పవన్ వర్మ బిల్లు సెక్యులిరిజంను ఉల్లంఘిస్తోందని చెప్పారు. గాంధీజీ బతికి ఉంటే ఈ బిల్లును తప్పుబట్టేవారని చెప్పారు పవన్ వర్మ. అయితే రాజ్యసభలో మాత్రం బిల్లుకు మద్దతు ఇవ్వకుండా నితీష్ కుమార్ సభ్యులకు చెప్పాలని పేర్కొన్నారు.

లోక్‌సభలో పాస్ అయిన బిల్లు రాజ్యసభలో ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టనుంది. ఇదిలా ఉంటే లోక్‌సభలో మెజార్టీని ఎంజాయ్ చేసిన బీజేపీ రాజ్యసభలో మాత్రం బిల్లును పాస్ చేయాంటే కాస్త శ్రమించక తప్పదు. బీజేపీకి సరిపడా సంఖ్యా బలం లేదు. అయితే రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అవుతుందనే కాన్ఫిడెన్స్‌ను కమలనాథులు వ్యక్తం చేస్తున్నారు.

English summary
Senior Janata Dal (United) leaders Prashant Kishor and Pavan Varma have criticised their own party's support to the controversial Citizenship (Amendment) Bill, which cleared Lok Sabha on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X