వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిరసనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు- ఎప్పుడైనా, ఎక్కడైనా చేస్తామంటే కుదరదని స్పష్టీకరణ

|
Google Oneindia TeluguNews

భారత్‌లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తున్న వేళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశంలో నిరసనలు తెలిపే హక్కుపై చర్చకు తావిచ్చేలా ఉంది. దేశంలో నిరసనలు తెలిపే హక్కు కొన్ని పరిమితులకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2019 నాటి షహీన్ బాగ్ నిరసనలపై దాఖలైన రివ్యూ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.

దేశంలో ప్రస్తుతం పౌరులు తమ హక్కుగా భావిస్తున్న నిరసనలు తెలిపే హక్కు అపరిమితం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దేశంలో కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా 2019లో ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో జరిగిన నిరసనలపై గతంలో ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు దేశంలో నిరసనలు తెలిపే హక్కుకూ పరిమితులు ఉన్నాయని స్పష్టం చేసింది. ఎప్పుడైనా, ఎక్కడైనా నిరసనలు చేస్తామంటే కుదరదని స్పష్టం చేసింది.

Right To Protest Cannot Be Anytime, Everywhere: Supreme Court

షహీన్‌ బాగ్‌లో నిరసనలు చట్ట వ్యతిరేకం అంటూ సుప్రీంకోర్టు గతేడాది ఇచ్చిన తీర్పుపై 12 మంది సామాజిక కార్యకర్తలు రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు.. ఏదైనా అంశంపై విభేదించినప్పుడు వెంటనే నిరసనలకు దిగడంలో తప్పు లేదని, కానీ బహిరంగ స్ధలాలను ఆక్రమించుకుని సుదీర్ఘంగా నిరసనలు చేపట్టడం మాత్రం సరికాదని తెలిపింది. ఇది ఇతరుల హక్కులకు కూడా భంగం కలిగించడమే అని జస్టిస్‌ ఎస్‌కే కౌల్, జస్టిస్ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ కృష్ణ మురారీతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

English summary
The right to protest and express dissent comes with certain duties and cannot be held "anytime and everywhere", the Supreme Court said in an order, dismissing a review petition on the anti-citizenship law protests held in Delhi's Shaheen Bagh in 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X