వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘మీకు మీరే క్యూట్’: కిరణ్ రిజిజుపై చైనా మీడియా అక్కసు

చైనా మీడియా మరోసారి తన అక్కసును చాటుకుంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించడం పట్ల ఇప్పటికే భారత్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా చైనా మీడియా కేంద్ర హోంశ

|
Google Oneindia TeluguNews

బీజింగ్‌/న్యూఢిల్లీ: చైనా మీడియా మరోసారి తన అక్కసును చాటుకుంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించడం పట్ల ఇప్పటికే భారత్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా చైనా మీడియా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్‌రిజుజుపై తన అక్కసు వెళ్లగక్కింది.

తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని, అరుణాచల్‌ప్రదేశ్‌ భారత్‌ నుంచి విడదీయరాని భాగమని రిజుజు చేసిన వ్యాఖ్యలపై చైనా మండిపడింది. 'బీజింగ్‌ దౌత్యప్రాతినిధ్యానికి సంబంధించి మాట్లాడటం క్యూట్‌గా ఉందని రిజుజు అనుకుంటున్నట్లు ఉన్నారు. కానీ ఆయన ప్రాథమిక అంశాలను విస్మరించారు. తైవాన్‌ మాదిరిగానే టిబెట్‌ కూడా చైనాలో అంతర్భాగం.. అది ఢిల్లీ అంగీకరించినా.. అంగీకరించకపోయినా' అంటూ చైనా డైలీ తన సంపాదకీయంలో స్పష్టం చేసింది.

'Rijiju May Think He's Cute'... Chinese Media Attacks Junior Home Minister

అంతేగాక, కల్లోలిత కాశ్మీర్‌ అంశంలో తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని చైనా భారత్‌ను హెచ్చరించింది. ఉగ్రవాది మసూద్ అజ్హర్, ఎన్ఎస్‌జీ లాంటి అంశాలపై చైనా వ్యవహరించిన తీరును పరిగణలోకి తీసుకునే భారత్ ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించింది. మంగళవారం దలైలామా పర్యటనపై రిజుజు మాట్లాడుతూ.. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో చైనా జోక్యం చేసుకోవద్దని తేల్చి చెప్పారు.

కాగా, ఇప్పటికైనా దలైలామా పర్యటనను వెంటనే నిలిపివేయాలని.. లేకపోతే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని చైనా హెచ్చరించింది. ఈ మేరకు బీజింగ్‌లో ఉన్న భారత రాయబారి విజయ్‌ గోఖలేకు తమ నిరసనను వ్యక్తం చేసినట్లు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి హువా చునియింగ్‌ తెలిపారు. మసూద్

English summary
A day after China warned that India has "severely damaged" relations by enabling the Dalai Lama's trip to Arunachal Pradesh, its state-run media has attacked Junior Home Minister Kiren Rijiju, who said earlier this week that the border state is "an inseparable part of India".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X