వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంబానీ షాకింగ్ ప్రాజెక్ట్..జురాసిక్ పార్క్: ప్రపంచంలోనే అతిపెద్ద జూ: వైసీపీ ఎంపీ కీ రోల్

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: అపర కుబేరుడు, పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ.. ఓ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్‌ను చేపట్టబోతోన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటిదాకా అడుగు పెట్టని ఓ వినూత్న ప్లాట్ ఫామ్ అది. నేచురల్ గ్యాస్ మొదలుకుని.. రిటైల్ మార్కెట్ వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించిన ముఖేష్ అంబానీ.. కొత్తగా ఓ జూపార్క్‌ను నెలకొల్పబోతోన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద జూపార్క్‌గా అది రూపుదిద్దుకోనుంది. ఈ మెగా ప్రాజెక్ట్‌ వ్యవహారాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ పర్యవేక్షించబోతోన్నారు. ఇందులో ఆయనేదే కీలక పాత్ర. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఆయన కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్‌గా ఉన్న విషయం తెలిసిందే.

పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన: మోడీ సర్కార్ కీలక నిర్ణయం: కేంద్ర కేబినెట్ ఆమోదంపుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన: మోడీ సర్కార్ కీలక నిర్ణయం: కేంద్ర కేబినెట్ ఆమోదం

280 ఎకరాల్లో..

280 ఎకరాల్లో..

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 280 ఎకరాల విస్తీర్ణంలో ఈ జూపార్క్ ఏర్పాటు కాబోతోంది. దీనికి అవసరమైన స్థల సేకరణ దాదాపు పూర్తయినట్టేనని తెలుస్తోంది. మరో రెండేళ్లలో దీన్ని అందుబాటులోకి తీసుకుని రావాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెబుతున్నారు. గ్రీన్ జులాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ కింగ్‌డమ్‌గా ఈ జూపార్క్‌కు పేరు పెట్టనున్నారు. ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబాని బ్రెయిన్ ఛైల్డ్ ప్రాజెక్ట్‌గా దీన్ని అభివర్ణిస్తోన్నారు. అనంత్.. పెట్ ప్రాజెక్ట్‌గా చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై చేసిన వ్యయాన్ని టికెట్ల రూపంలో సందర్శకుల నుంచి వసూలు చేయాలని ప్రాథమికంగా నిర్ధారించారు.

ఏవీ లేవనుకుండా..

ఏవీ లేవనుకుండా..


స్థాయికి తగ్గట్టుగా ఈ జూపార్క్‌లో దాదాపు అన్ని రకాల జీవజాతులను సందర్శనకు ఉంచుతారని బిజినెస్ ఇన్‌సైడర్ వెబ్‌సైట్ పేర్కొంది. వంద రకాల వేర్వేరు జాతులకు చెందిన వన్యప్రాణులు, పక్షులు, క్షీరదాలను జూలో సందర్శనార్థం అందుబాటులోకి తీసుకొస్తారని తెలిపింది. అత్యంత అరుదైన వన్యప్రాణులను ఇక్కడ తిలకించే వీలు కల్పించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ భావిస్తోంది. కొమొడొ డ్రాగన్స్ (Komodo dragons), ఆఫ్రికన్ సింహాలు, పిగ్మీ హిప్పోలు, రాయల్ బెంగాల్ టైగర్లు.. వంటి అనేక రకాల జీవజాలాన్ని ఈ జూపార్క్‌లో చూడొచ్చని తెలిపింది.

నైట్ సఫారీ..

నైట్ సఫారీ..

ఈ జూపార్క్‌లో ఫ్రాగ్ హౌస్, డ్రాగన్ ల్యాండ్, అక్వాటిక్ కింగ్‌డమ్, ఇండియన్ డెసర్ట్, ఎగ్జాటిక్ ఐలండ్స్ వంటి పేర్లతో విభిన్న రకాల పేర్లతో ప్రత్యేకంగా సందర్శన ప్రదేశాలను నెలకొల్పుతారని బిజినెస్ ఇన్‌సైడర్ పేర్కొంది. అలాగే- నైట్ సఫారీకి అనుమతి ఇచ్చే అవకాశాలు లేకపోలేదని తెలిపింది. ట్రెక్కింగ్, క్యాంపింగ్ వంటి అడ్వెంచర్ యాక్టివిటీస్‌ను నిర్వహించే ప్రతిపాదనలను రిలయన్స్ యాజమాన్యం పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేసింది.

విమర్శలు సైతం..

విమర్శలు సైతం..

ఈ మెగా ప్రాజెక్ట్‌పై అప్పుడే విమర్శలు సైతం చెలరేగుతోన్నాయి. దీనికి కారణం- ప్రభుత్వ ఆధీనంలోని జూపార్క్‌ల నుంచి కొన్ని రకాల వన్యప్రాణులను తరలించాలని నిర్ణయించడమే. అస్సాం ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తోన్న జూపార్క్ నుంచి రెండు బ్లాక్ పాంథర్లను తరలించడానికి ఒప్పందాలను కుదర్చుకోనుండటం వివాదం రేపుతోంది. ప్రభుత్వానికి చెందిన జూపార్క్ నుంచి వన్యప్రాణులను ఓ ప్రైవేటు జూకు తరలించడం పట్ల జంతు సంరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. వన్యప్రాణుల సంరక్షణ ప్రశ్నార్థకమౌతుందని చెబుతున్నారు.

English summary
Reliance Industries corporate empire Mukesh Ambani has plan to build a 113-hectare (280-acre) zoo and animal sanctuary called “Green Zoological Rescue and Rehabilitation Kingdom” in Jamnagar city in the Gujarat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X