వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిమ్మ తిరిగే నీరవ్ మోడీ సంపద: రింగ్ రూ.10 కోట్లు, వాచీ రూ.1.40 కోట్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

Nirav Modi Ring And Watch Worth Crores నీరవ్ మోడీ దిమ్మ తిరిగే సంపద

ముంబై: మూడు రోజుల పాటు సిబిఐ, ఈడీ నిర్వహించిన సోదాల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసు నిందితుడు నీరవ్ మోడీకి సంబంధించి దిమ్మ తిరిగే సంపద బయటపడింది. ఈ మేరకు శనివారం జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

సిబిఐ, ఈడి అధికారులు మూడు రోజుల పాటు ముంబైలోని సముద్ర మహల్ నివాసంలో సోదాలు నిర్వహించారు. పెద్ద యెత్తున వస్తువులను వారు స్వాధీనం చేసుకున్నారు. అత్యంత విలువైన వస్తువులు వారికి చిక్కాయి.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదననెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

రింగ్ విలువ ఇదీ...

రింగ్ విలువ ఇదీ...

సిబిఐ, ఈడి అధికారులకు చిక్కిన రింగ్ విలువ పది కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. వాచీ రూ.1.40 కోట్ల విలువ చేస్తుందని అంటున్నారు. ప్రాచీన ఆభరణాలు, అరుదైన పెయింటింగ్స్ కూడా నీరవ్ మోడీ నివాసంలో ఉన్నాయి. వాటి విలువ కొన్ని లక్షల నుంచి కొన్ని కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంటున్నారు.

విలువ దాదాపు రూ.50 కోట్లు

విలువ దాదాపు రూ.50 కోట్లు

నీరవ్ మోడీ నివాసంలో స్వాధీనం చేసుకున్న వస్తువుల విలుపను లెక్క కట్టే పనిలో సిబిఐ, ఈడి అధికారులు ఉన్నారు. తమకు చిక్కిన వస్తువుల విలువ రూ.50 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు.

అది నీరవ్ మోడీ నివాసం.

అది నీరవ్ మోడీ నివాసం.

ముంబైలోని సముద్ర మహల్ నీరవ్ మోడీ నివాసం. ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను వేల కోట్ల రూపాయలకు ముంచాడనే ఆరోపణలు ఎదుర్కుంటున్నారడు ఈ కేసులో ఆయన మేనమామ మెహుల్ చోక్సీపై, తదితరులపై విచారణ జరుగుతోంది. వారు ఇప్పటికే దేశం విడిచి పారిపోయారు.

ఈడి సోదాలు ఇలా.

ఈడి సోదాలు ఇలా.

నీరవ్ మోడీకి చెందిన 21 ఆస్తులను ఈడీ గత నెలలో సీజ్ చేసింది. వాటిలో ఓ పెంట్‌హౌస్, ఓ ఫామ్ హౌస్ ఉన్నాయి. ఈడీ స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ ర.523 కోట్ల వరకు ఉంటుందని అంచనా. సమన్లు జారీ చేసినప్పటికీ నీరవ్ మోడీ గానీ చోక్సీ గానీ దేశానికి తిరిగి రావడానికి సిద్ధపడడం లేదు.

English summary
A three-day search conducted by the CBI and the ED at Nirav Modi's Samudra Mahal in Worli has revealed treasures running into several crores.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X