వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Riots: శ్రీరామనవమి ఊరేగింపు, మతఘర్షణలు, హత్య, తీవ్రగాయాలు, టియర్ గ్యాస్, ప్రధాని మోదీ ఇలాకాలో !

|
Google Oneindia TeluguNews

అహమ్మదాబాద్: దేశవ్యాప్తంగా శ్రీరామనవమి పండుగ ఘనంగా జరిగింది. శ్రీరాముడి ఊరేగింపు కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. అయితే శ్రీరామనవమి వేడుకల సందర్బంగా జరిగిన ఊరేగింపులో మతఘర్షణలు జరిగి ఒకరు మరణించారు. రెండు వేర్వేరు నగరాల్లో జరిగిన మతఘర్షణల కారణంగా ఒకరు చనిపోగా అనేక మందికి గాయాలైనారు. అల్లరిమూకలను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ ఉపయోగించి లాఠీలకు పని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోనే రెండు నగరాల్లో శ్రీరామనవమి సందర్బంగా మతఘర్షణలు జరగడం కలకలం రేపింది. రెండు నగరాల్లో అదనపు పోలీసు బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేశామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. శ్రీరామనవమి సందర్బంగా మతఘర్షణలు ఎలాజరిగాయి అంటూ పోలీసులు మీడియాకు చెప్పారు.

Weekend party: హోటల్ లో అర్దరాత్రి 24 మంది అమ్మాయిలు, 64 మంది ?, లిక్కర్, డ్రగ్స్ ? మ్యాటర్ !Weekend party: హోటల్ లో అర్దరాత్రి 24 మంది అమ్మాయిలు, 64 మంది ?, లిక్కర్, డ్రగ్స్ ? మ్యాటర్ !

ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

దేశవ్యాప్తంగా శ్రీరామనవమి పండుగ ఘనంగా జరిగింది. శ్రీరాముడి ఊరేగింపు కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు, నగరాలు అని తేడా లేకుండా ప్రముఖ ఆలయాలు, రాముడి ఆలయాలు, ఆంజనేయస్వామి ఆలయాల్లో శ్రీరామనవమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు.

 ఊరేగింపులు..... పానకాలు, వడపప్పు

ఊరేగింపులు..... పానకాలు, వడపప్పు

శ్రీరామనవమి సందర్బంగా జరిగిన వేడుకల్లో భక్తులకు పనకాలు, మజ్జిగ, వడపప్పు, ప్రసాదాలు పంచిపెట్టారు. శ్రీరామనవమి సందర్బంగా దేశవ్యాప్తంగా శ్రీరాముడి విగ్రహాలు. చిత్రపటాలు, పల్లకీల ఊరేగింపు ఘనంగా జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు శ్రీరాముడి ఊరేగింపు కార్యక్రమాలు జరిగాయి.

మతఘర్షణల్లో ఒకరి మృతి

మతఘర్షణల్లో ఒకరి మృతి

శ్రీరామనవమి వేడుకల సందర్బంగా గుజరాత్ లోని ఖంభాట్ నగరంలో జరిగిన ఊరేగింపులో మతఘర్షణలు జరిగి ఒకరు మరణించారు. శ్రీరామనవమి సందర్బంగా ఊరేగింపు జరుగుతున్న సమయంలో రెండు వర్గాల మద్య గొడవలు మొదలైనాయి. రానురాను గొడవలు ఎక్కువ అయ్యి ఒకరి మీద ఒకరు రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో 65 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి మరణించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చనిపోయిన వ్యక్తి పేరు, వివరాలు తెలియడం లేదని, అల్లర్ల కారణంగా తీవ్రగాయాలై ఆయన చనిపోయారని, వివరాలు సేకరిస్తున్నామని పోలీసు సూపరెండెంట్ అజిత్ రాజయన్ మీడియాకు చెప్పారు.

హిమ్మత్ నగర్ లో సేమ్ సీన్

గుజరాత్ లోని హిమ్మత్ నగర్ లో కూడా శ్రీరామనవమి సందర్బంగా మతఘర్షణలు జరిగాయి. ఈ మతఘర్షణల్లో ఇద్దరికి తీవ్రగాయాలైనాయని పోలీసు సూపరెండెంట్ అజిత్ రాజయన్ మీడియాకు చెప్పారు. రెండు వేర్వేరు నగరాల్లో జరిగిన మతఘర్షణల కారణంగా ఒకరు చనిపోగా అనేక మందికి గాయాలైనారు. ఈ సందర్బంగా రెచ్చిపోయిన అల్లరిమూకలు పలు షాపులకు నిప్పంటించి వాటిని కాల్చి బూడిద చేశారు.

పోలీసులు ఎంట్రీ

పోలీసులు ఎంట్రీ


అల్లరిమూకలను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ ఉపయోగించి లాఠీలకు పని చెప్పారు. ప్రధాన మంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ లోనే రెండు నగరాల్లో శ్రీరామనవమి సందర్బంగా మతఘర్షణలు జరగడం కలకలం రేపింది. రెండు నగరాల్లో అదనపు పోలీసు బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేశామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. శ్రీరామనవమి సందర్బంగా మతఘర్షణలు ఎలాజరిగాయి అంటూ పోలీసులు మీడియాకు చెప్పారు.

English summary
Sri Ram Navami: One person was killed and another one injured in a communal clash in Khambhat city of Gujarat during a procession taken out on the occasion of Ram Navami on Sunday,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X