వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బోరు బావిలో చిన్నారి మృతి, 36 అడుగుల్లో, ఇంటర్వూలు ఇస్తారా, దద్దమ్మలు, డీఎంకే !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులోని తిరుచ్చిరాపల్లి జిల్లా, మనప్పారై సమీపంలో బోరు బావిలో పడిపోయిన సుజిత్ విల్సన్ (2) ప్రాణాలు పోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కారణమని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. నాలుగు రోజులైనా బోరు బావిలో నుంచి సుజిత్ ను సురక్షితంగా బయటకు తీసుకురాలేకపోయారని, రక్షణా చర్యలు చేపట్టిన ప్రాంతంలో మంత్రులు, అధికారయంత్రాంగం నిర్లక్షంగా వ్యవహరించి కేవలం ప్రెస్ మీట్లు పెట్టి ఇంటర్వూలు ఇవ్వడానికి, ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికే ప్రాధాన్యత ఇచ్చారని తమిళనాడు అసెంబ్లీలో ప్రధాన ప్రతపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ (డీఎంకే) మండిపడ్డారు.

ఇంత బతుకు బతికి కుక్క చావు అంటే ఇదే, వయాగ్రా మాత్రలతో వేలాది మందిని రేప్ చేసి!ఇంత బతుకు బతికి కుక్క చావు అంటే ఇదే, వయాగ్రా మాత్రలతో వేలాది మందిని రేప్ చేసి!

ఎంకే స్టాలిన్ నివాళి

ఎంకే స్టాలిన్ నివాళి

తిరుచ్చిరాపల్లి మనప్పారై సమీపంలోని సుజిత్ విల్సన్ మృతదేహానికి డీఎంకే పార్టీ నాయకుడు ఎంకే. స్టాలిన్ నివాళి అర్పించారు. సుజిత్ సమాధి వద్ద పూలమాలు వేసిన ఎంకే. స్టాలిన్ సుజిత్ అందరికీ దూరం అయినా మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.

చేతకాని ప్రభుత్వం

చేతకాని ప్రభుత్వం

సుజిత్ విల్సన్ కేవలం 36 అడుగుల లోతులో బోరు బావిలో చిక్కుకుపోయాడని ఎంకే. స్టాలిన్ అన్నారు. 36 అడుగల లోతులో చిక్కుకుపోయిన సుజిత్ ను నాలుగు రోజులుఅయినా సురక్షితంగా రక్షించడంలో తమినాడు ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ఎంకే. స్టాలిన్ ఆరోపించారు. ఇలాంటి చేతకాని దద్దమ్మ ప్రభుత్వాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఎంకే. స్టాలిన్ మండిపడ్డారు.

నిర్లక్షం కారణం

నిర్లక్షం కారణం

సుజిత్ బోరు బావిలో పడిపోయిన తరువాత పోలీసులు, అగ్నిమాకప సిబ్బంది, ఎన్ఆర్ డీఏ సిబ్బంది ముందుగా సమాచారం ఇవ్వడంలో ప్రభుత్వం, అధికారులు నిర్లక్షం చేశారని ఎంకే స్టాలిన్ ఆరోపించారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్షం వలనే సుజిత్ ప్రాణాలు పోయాయని, బాలుడి కుటుంబ సభ్యులకు ఏం సమాధానం చెబుతారని తమిళనాడు ప్రభుత్వాన్ని ఎంకే. స్టాలిన్ ప్రశ్నించారు.

ఆర్మీ ఎందుకు రాలేదు ?

ఆర్మీ ఎందుకు రాలేదు ?

సుజిత్ ను రక్షించడానికి ఎందుకు ఆర్మీకి సమాచారం ఇవ్వలేదని, వారి సహాయం ఎందుకు తీసుకోలేదని, బాలుడి కుటుంబ సభ్యులతో పాటు దేశానికి తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు సమాధానం చెప్పాలని ఎంకే. స్టాలిన్ డిమాండ్ చేశారు. కేవలం ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి, ప్రెస్ మీట్లు పెట్టి ఇంటర్వూలు ఇవ్వడానికి మంత్రులు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, ఇప్పుడు మీ నిర్లక్షం కారణంగా సుజిత్ ప్రాణాలు తిరిగి వస్తాయా అని తమిళనాడు ప్రభుత్వాన్ని ఎంకే. స్టాలిన్ ప్రశ్నించారు.

రాజకీయాలు ముఖ్యం

రాజకీయాలు ముఖ్యం

తమిళనాడు ప్రభుత్వం కేవలం రాజకీయాలకే ఎక్కువ ప్రధాన్యత ఇస్తోందని, సుజిత్ ను రక్షించడంలో పూర్తిగా విఫలం అయ్యిందని కరూర్ లోక్ సభ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ జ్యోతిమణి ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్షం కారణంగా సుజిత్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని, ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అమ్మా మక్కల్ మున్నేట్ర కగజం (AMMK) పార్టీ నాయకుడు, చెన్నైలోని ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ. దినకరన్ అన్నారు.

English summary
As people mourn the death of Sujith, the DMK and Congress blamed the Tamil Nadu government for the tragedy. DMK chief MK Stalin said, Had ministers shown interest in rescue operations instead of giving media interviews we could have reached Sujith in time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X