• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

RIP Tiktok .... టిక్‌టాక్ లో ఫ్యాన్స్ ఆవేదన.. నిషేధంతో టిక్‌టాక్ స్టార్స్ కు షాక్

|

భారత్ చైనా సరిహద్దు ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అవుతుంది. దీంతో జాతీయ భద్రత మరియు గోప్యతా సమస్యలపై దృష్టి సారించిన ఇండియా టిక్ టాక్ తో సహా 59 చైనా మొబైల్ యాప్స్ నిషేధించింది.ఈ యాప్స్ భారతదేశం యొక్క సార్వభౌమాధికారం మరియు సమగ్రత, భారతదేశం యొక్క రక్షణ, మరియు భద్రత కోసం అని సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వం ఏం చెప్పినా భారతీయులు అత్యధికంగా వినియోగించే టిక్ టాక్ నిషేధం మాత్రం టిక్ టాక్ ఫ్యాన్స్ కు చేదు వార్త .

  #RIPTiktok : భారత్‌లో Tik Tok బ్యాన్.. మొత్తం 59 China Apps పై నిషేధం విధించిన భారత్ ! || Oneindia

  టిక్ టాక్ పోతుందా .. అయితే ప్రత్యామ్నాయం ఉందిగా .. చైనా యాప్స్ కు ప్రత్యామ్నాయాలివే !!

  సినిమాలు, సీరియల్స్ ప్రమోషన్ కోసం టిక్ టాక్ యాప్

  సినిమాలు, సీరియల్స్ ప్రమోషన్ కోసం టిక్ టాక్ యాప్

  చైనీస్ యాప్ అయిన టిక్ టాక్ పై నిషేధం వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లో పాపులర్ అయిన వారి పాపులారిటీపై నీలి నీడలు కమ్ముకునేలా చేసింది. బాలీవుడ్ నటులతో పాటు పలువురికి టిక్ టాక్ తమ ఫ్యాన్స్ తో మాట్లాడటానికి , వారిని ఎంటర్ టైన్ చెయ్యటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా చాలా మందికి టిక్ టాక్ సెలబ్రిటీ స్టేటస్ తెచ్చి పెట్టింది. దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, షాహిద్ కపూర్ నుండి మాధురి దీక్షిత్ వరకు - చాలా మంది తమ అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి మరియు వారి సినిమాలను ప్రోత్సహించడానికి టిక్ టాక్ ను ఒక మాధ్యమంగా ఉపయోగిస్తున్నారు.ఇక అన్ని భాషల సినీ పరిశ్రమ వర్గాలు టిక్ టాక్ ను ఉపయోగిస్తున్నాయి. సీరియల్స్ లో యాక్ట్ చేసే వారు కూడా ప్రమోషన్ కు టిక్ టాక్ ఆడుతున్నారు.

  టాలెంట్ చూపించే ప్లాట్ ఫాం టిక్ టాక్ తో బోలెడు నాలెడ్జ్ కూడా

  టాలెంట్ చూపించే ప్లాట్ ఫాం టిక్ టాక్ తో బోలెడు నాలెడ్జ్ కూడా

  అంతేకాదు ఆడా, మగా, టీజీ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమ లో ఉన్న టాలెంట్ ను అందరికీ తెలిసేలా టిక్ టాక్ లో పల వీడియోలు చేసి షేర్ చేస్తున్నారు. టిక్ టాక్ యాప్ ద్వారా ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా, ఇన్ఫర్మేషన్, కామెడీ, న్యూస్, ప్రతిరోజూ ట్రెండ్ అవుతున్న అనేక విషయాలు, పాలిటిక్స్ ఇవన్నీ తెలుసుకోగలుగుతారు. చాలామంది టిక్ టాక్ వేదికగా వివిధ రంగాలకు సంబంధించి తమ అనుభవాలను వీక్షకుల తో పంచుకుంటున్నారు. అటువంటి టిక్ టాక్ నిషేధం ఇప్పుడు చాలామంది టిక్ టాక్ యూజర్స్ కు మింగుడు పడడం లేదు.

  RIP TikTok ... టిక్ టాక్ లో వీడియోలు హల్ చల్

  RIP TikTok ... టిక్ టాక్ లో వీడియోలు హల్ చల్

  టిక్ టాక్ నిషేధించిన తర్వాత ఇక టిక్ టాక్ రాదేమో అని బాధ పడుతున్న చాలామంది టిక్ టాక్ వేదికగానే తమ ఆవేదనను వెలిబుచ్చారు. RIP TikTok అంటూ తెగ బాధపడిపోతున్నారు. ఇంతకాలం మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేశావంటూ టిక్ టాక్ ను తెగ పొగుడుతున్నారు. కొందరైతే టిక్ టాక్ కోసం పూజలు, భజనలు చేయడం,మరికొందరు ఫ్రెండ్స్ ఇంకా కలవము కావచ్చు. అందరూ జాగ్రత్తగా ఉండండి అని జాగ్రత్తలు చెప్పుకోవడాలు, కాంటాక్ట్ నెంబర్ తీసుకోవడాలు, సెండ్ ఆఫ్ సందేశాలు , ఫేర్ వెల్ పార్టీలు ఒకటేమిటి నానా హంగామా చేస్తున్నారు.

  ఇండియన్స్ కు వ్యసనంగా మారిన టిక్ టాక్

  ఇండియన్స్ కు వ్యసనంగా మారిన టిక్ టాక్

  ఒకటేమిటి టిక్ టాక్ లో చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఒక మనిషి చనిపోతే కూడా ఇంతగా బాధపడని వాళ్లు, ఒక చైనీస్ యాప్ టిక్ టాక్ నిషేధం అంటే లబోదిబోమని ఏడుస్తున్నారు. అంతగా ఇండియన్స్ టిక్ టాక్ కు అలవాటుపడ్డారు. రోజులో 70శాతం సమయం అంతా టిక్ టాక్ మీదే గడుపుతున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో టిక్ టాక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఒకలెక్కలో చెప్పాలంటే చాలా మంది జనాలకుటిక్ టాక్ టం జీవితంలో భాగంగా మారింది. వ్యసనంగా తయారైంది.

  టిక్ టాక్ సెలబ్రిటీలకు కష్టమే !!

  టిక్ టాక్ సెలబ్రిటీలకు కష్టమే !!

  టిక్ టాక్ పేరుతో బతికేస్తున్న వారు కూడా లేకపోలేదు. టిక్ టాక్ పేరుతో బాగా పాపులర్ అయిన సెలబ్రిటీలు ఇప్పుడు టిక్ టాక్ బ్యాన్ తో ఒకరకంగా చెప్పాలంటే ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్ళే పరిస్థితి ఉంది. తమలో ఉన్న టాలెంట్ తో , స్కిల్ తో పాపులర్ అయ్యి సినిమాలలో ఆఫర్లు పొందుతున్న సెలబ్రిటీలు ఇప్పుడు టిక్ టాక్ బ్యాన్ చేస్తే తమ పాపులారిటీ ఎలా అని , తమకు అవకాశాలు ఎలా వస్తాయని ఆలోచనలో పడ్డారు. దీప్తి సునయన , దీపికా పిల్లి , ఉప్పల్ బాల ,అగ్గిపెట్టె మచ్చా , రేవతక్క వంటి వారు టిక్ టాక్ స్టార్స్ గా గుర్తింపు పొంది ఒక వెలుగు వ్లుగుతున్నారు. కానీ ఇప్పుడు వీరందరికీ షాక్ ఇచ్చినట్టు అయ్యింది. వీరి భవిష్యత్ ప్రస్తుతం ప్రశ్నార్ధకం అయింది.

  English summary
  Many people who are worried that the tik tok ban. The tribe is saying to RIP TikTok. people are praising Tik Tok app as the app has entertained them so far. Some may be worshiping, performing poojas for tik tok, and they meeting friends and Taking Contact Number, Send Of Messages, Farewell parties are goning on in tik tok app now
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X