• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీఎం గారూ.. బుద్ధి మార్చుకోండి -బూతు వాక్యంతో అమితాబ్ మనవరాలు నవ్యా కౌంటర్ -అమ్మాయిల జీన్స్ వివాదంపై

|

పీఠమెక్కి పట్టుమని పదిరోజులైనా తిరక్కముందే వరుస వివాదాల్లో కూరుకుపోయారు ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్. మొన్నటికి మొన్న ప్రధాని నరేంద్ర మోదీని శ్రీరాముడితో పోల్చుతూ, జనం పూజలు చేస్తారన్న రావత్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తగా, ఇప్పుడు మహిళల వస్త్రధారణపై ఆయన వెల్లడించిన అభిప్రాయలు వివాదాస్పదం అయ్యాయి. ఆయనకు.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన మనవరాలు నవ్యా నవేలి నందా ఓ బూతు పదంతో ఘాటుగా కౌంటరిచ్చారు.

షాకింగ్: 'దంగల్’ సోదరి రితికా ఫోగాట్ ఆత్మహత్య -స్వల్ప తేడాతో ఫైనల్ ఓటమిని భరించలేక..షాకింగ్: 'దంగల్’ సోదరి రితికా ఫోగాట్ ఆత్మహత్య -స్వల్ప తేడాతో ఫైనల్ ఓటమిని భరించలేక..

ఫ్యాషన్ పేరుతో అమ్మాయిలు చిరిగిన జీన్స్ ధరించడం మంచి పద్ధతి కాదని, భారతీయ సంస్కృతికి అది విఘాతమని, అమ్మాయిలు అలాంటి దుస్తులు ధరించకుండా ఇంట్లోవాళ్లే కట్టడి చేయాలని ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ అన్నారు. ఉత్తరాఖండ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో బుధవారం డెహ్రాడూన్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

ripped jeans controversy: Navya Naveli Nanda slams Uttarakhand bjp CM, says Change mentality

చిరిగిన జీన్స్ ధరించడం ద్వారా అమ్మాయిలు, మహిళలు ఈ సమాజానికి ఏం సందేశమిస్తున్నారో అర్థం కావడంలేదని, మోకాళ్లును నగ్నంగా చూపడం భారతీయ సంస్కృతి కాదని, ధనవంతుల్లాగా కనబడడానికి తహతహలాడే క్రమంలోనే ఆడ పిల్లలకు ఇలాంటివి నేర్పుతున్నారని, ఆడపిల్లలకు ఇళ్లలోనే సరైన సంస్కృతిని నేర్పిస్తే గనుక వారు ఎంత ఆధునికంగా మారినా, జీవితాల్లో ఎన్నటికీ విఫలం కాబోరని సీఎం రావత్ పేర్కొన్నారు. అయితే..

 జగన్‌కు కేంద్రం షాక్ -చంద్రబాబును అడ్డంపెట్టి రైల్వే బాంబు -ఏపీ సర్కార్ దివాళా! -విశాఖ ఐటీఐఆర్‌ వెనక్కి జగన్‌కు కేంద్రం షాక్ -చంద్రబాబును అడ్డంపెట్టి రైల్వే బాంబు -ఏపీ సర్కార్ దివాళా! -విశాఖ ఐటీఐఆర్‌ వెనక్కి

ripped jeans controversy: Navya Naveli Nanda slams Uttarakhand bjp CM, says Change mentality

కేవలం వేసుకునే దుస్తులను బట్టి మహిళల స్థాయిని నిర్ణయించడం నిజంగా శోచనీయమంటూ అమితాబ్ మనవరాలు నవ్యా నవేలి నందా మండిపడ్డారు. 'వాట్ ద ఎఫ్' పదాలను వాడుతూ, ఉత్తరాఖండ్ సీఎం రావత్ ను ఉద్దేశించి.. ''మేం ఏది వేసుకోవాలో చెప్పడానికంటే ముందు మీ మనస్తత్వాన్ని మార్చుకోండి. నిజం చెప్పాలంటే ఇక్కడ షాకింగ్ విషయం అమ్మాయిలు చిరిగిన జీన్స్ ధరించడం కాదు, దాని గురించి మీరు సందేశమివ్వడం'' అని నవ్యా నందా ఫైరయ్యారు. తాను చిరిగిన జీన్స్‌ ధరించిన ఓ ఫోటోను పోస్టు చేస్తూ .. ''నేను గర్వంగా.. నా రిప్డ్ జీన్స్ ధరిస్తాను'' అని నవ్యా పేర్కొన్నారు. రిప్డ్ జీన్స్ వివాదంపై బిగ్ బీ మనవరాలి కామెంట్లపైన సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
Megastar Amitabh Bachchan’s granddaughter Navya Naveli Nanda responded to Uttarakhand Chief Minister Tirath Singh Rawat’s remark about women wearing ripped jeans. She wrote, “Change your mentality before changing our clothes because the only thing shocking here is the message comments like this send to society.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X