వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధికారమంటే ఇష్టమే, రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు, శశికళకు చెక్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై: అధికారమంటే ఇష్టమే అంటూ ప్రముఖ సినీనటుడు, సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో సంచలనం సృష్టించాయి. ఎన్నాళ్లగానో వాయిదా పడుతూవస్తున్న తన రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి రజనీకాంత్ ఇచ్చిన సంకేతంగా దీనిని చాలమంది భావించారు.

బీజేపీతో కలిసి రజనీకాంత్ సొంతంగా రాజకీయ పార్టీ ప్రారంభిస్తారనే వరకూ ఆవూహాగానాలు వెళ్లాయి. జయలలిత మరణం తరువాత తమిళనాడులో నెలకొన్న పరిస్థితుల పట్ల రజనీకాంత్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను ఆయన భర్తీ చేస్తారని చాల మంది భావిస్తున్నారు.

<strong>పన్నీర్ కు కన్నీరే మిగిలింది: రహస్య సమావేశం, ఇప్పుడు ఏం చేద్దాం?</strong>పన్నీర్ కు కన్నీరే మిగిలింది: రహస్య సమావేశం, ఇప్పుడు ఏం చేద్దాం?

సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న సంకేతాలు దీనికి అద్దం పడుతున్నాయి. ఇప్పటికే అన్నాడీఎంకే పగ్గాలు తన చేతిలోకి తీసుకున్న శశికళ త్వరలో ముఖ్యమంత్రి పదవినీ చేపడుతున్న సమయంలో రాజనీకాంత్ రాజకీయాల్లోకి రావలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Ripples in Tamil Nadu after Rajinikanth speaks about Power

అదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ తమ అభిమాన నటుడికి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. శశికళ సీఎం పదవి చేపడుతున్న తరుణంలో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో సంచలనం సృష్టించాయి. ఈ విషయంపై అన్నాడీఎంకే నాయకులు మౌనం వహించారు.

1996 శాసన సభ ఎన్నికల సందర్బంగా జయలలిత అధికారంలోకి వస్తే దేవుడు కూడా తమిళనాడును రక్షించలేడు అంటూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఆమె ఓటమికి ప్రధాన కారణం అయ్యింది. అయితే దాదాపు దశాబ్ధం తరువాత జయలలితను రజనీకాంత్ లక్ష్మిదేవితో పోల్చుతూ ప్రశంసలు కురిపించారు.

<strong>శశికళ తమిళనాడు సీఎం అయితే, బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఏం చెప్పారంటే !</strong>శశికళ తమిళనాడు సీఎం అయితే, బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఏం చెప్పారంటే !

2014 లోక్ సభ ఎన్నికల సందర్బంగా నరేంద్ర మోడీ స్వయంగా వెళ్లి కలిసినా రజనీకాంత్ రాజకీయాల విషయంలో ఆసక్తి చూపలేదు. అయితే రజనీకాంత్ ద్వారా తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయాలన్న ప్రయత్నాలను ఆ పార్టీ నేతలు కొనసాగిస్తూనే ఉన్నారు.

ఎంతో ప్రజాదరణ ఉన్న రజనీకాంత్ ను ఒప్పించి రాజకీయాల్లోకి తీసుకురావటానికి ఇదే సరైన సమయం అని బీజేపీ నేతలు భావించి ఆదిశగా తమ యత్నాలను ముమ్మరం చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. అయితే తాను ఆధ్యాత్మిక శక్తి అనే భావనతోనే అధికారం అనే మాటను ఉపయోగించానని రజనీకాంత్ వివరణ ఇచ్చారు.

<strong>పవర్' గురించి మాట్లాడిన రజనీకాంత్, కానీ</strong>పవర్' గురించి మాట్లాడిన రజనీకాంత్, కానీ

ధనం, కీర్తి, ఆధ్మాత్మిక శక్తిలో ఏది కావాలో కోరుకోమంటే తాను ఆధ్యాత్మిక శక్తిని కోరుకుంటానని రజనీకాంత్ తెలిపారు. ఆధ్యాత్మికతకే అత్యంత శక్తి ఉంటుందని, తనను అపార్థం చేసుకోరాదని రజనీకాంత్ కోరారు. శశికళ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో సంచలనం సృష్టించాయి.

English summary
Superstar Rajinikanth's recent statement about liking power sent ripples through Tamil Nadu, till he clarified that he had spoken in context of spiritualism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X