• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చాందినీ దగ్గరకు వెళ్లిన దీవానే..! రిషీ కపూర్ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయంటున్న అభిమానులు..!!

|

ముంబాయి/హైదరాబాద్ : భారత సిల్వర్ స్క్రీన్ పైన మ్యాజిక్ చేసి చూపించిన నటీనటులు చాలా అరుదుగానే ఉన్నారని చెప్పాలి. భారత సినీ కథానాయకుల మలి దశలో ప్రవేశించిన రిషి కపూర్ వెండితెర మీద తనదైన ముద్రను వేసుకున్నారు. ప్రేమకోసం పరితపించే ప్రియుడుగా, ప్రేమలో ఓడిపోయిన ప్రేమ పిపాసిగా, కుటుంబ బరువు మోసే పెద్దన్నగా, బాద్యతగల భర్తగా ఎన్నో పాత్రల్లో జీవించారు రిషికపూర్. నూనూగు మీసాల లేలేత ప్రాయంలో ఉన్నప్పుడు, మగువ అందాల ఆకర్షణకు లోనై, మానసిక ఘర్షణకు గురైన బాలుడుగా సాగర్ సినిమాలో రిషీ కపూర్ చూపించిన నటన భారత సిని ప్రేమికుల గెండెల్లో చెరగని ముద్ర వేసుంకుంది. భారత సిని వినీలాకాశంలో ఎదురులేని దృవతారగా ఎదిగిన రిషీ కపూర్ అకాల మరణాన్ని భారత చిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది.

మలితరం కథానాయకుడు.. రిషీ కపూర్ అకాల మరణంతో అలుముకున్నవిషాద ఛాయలు..

మలితరం కథానాయకుడు.. రిషీ కపూర్ అకాల మరణంతో అలుముకున్నవిషాద ఛాయలు..

ఓ దృవ తార నేల రాలింది. 1970, 80, 90 దశకాల్లో విజయవంతమైన కథానాయకుడిగా ప్రసిద్ది చెందిన రిషీ కపూర్ నేటి ఉదయం కోట్లాది అభిమానులను శోక సంద్రంలో ముంచి కానరాని లోకాలకు వెళ్లిపోయారు. రిషీ కపూర్ మరణం పట్ల కోట్లది మంది అభిమానుల్లో విషాదఛాయలు అలుముకొన్నాయి. భారత సినీ పరిశ్రమ దేశ ప్రజల మన్ననలను పొందుతున్న తరుణంలో, వైవిద్య సినిమాలకు రూపకల్పన జరుగుతూ, సృజనాత్మకత వెలుగుచూస్తున్న రోజుల్లో రిషీ కపూర్ వంటి వైవిద్య నటుడు భారత సినీ దర్శకులకు వరంలా పరిణమించారు. కొత్తగా వస్తున్న దర్శకుల ప్రతిభకు అరుదైన రిషీ కపూర్ నటన తోడై అద్బుత దృశ్య కావ్యాలు ఆవిష్కరించబడేందుకు నాంది పలికింది.

 రిషీ కపూర్ వంశం ఓ వటవృక్షం.. వంశపారంపర్యగా వచ్చిన నటన..

రిషీ కపూర్ వంశం ఓ వటవృక్షం.. వంశపారంపర్యగా వచ్చిన నటన..

భారత సిని ప్రరిశ్రమలో తన మార్క్ ను చూపిస్తూ వినూత్న సినిమాలను తెరకెక్కిస్తున్న కపూర్ కుటుంబం నుండి మరో విజయవంతమైన నటుడిగా సినీరంగ ప్రవేశం చేసారు రిషీ కపూర్. రిషీ కపూర్ సినిమాల్లోకి వచ్చే సమయానికే వారి కుంటుంబం సినిమాలు నిర్మించడంలో మొదటి స్థానంలో నిలిచింది. కపూర్ సినిమాల్లో నటించే అవకాశం వస్తే జీవితంలో స్థిరపడిపోయినట్టే అనేతంగా ఎదిగిపోయింది కపూర్ ఫామిలి. మొదటి జనరేషన్ గా పృథ్వీరాజ్ కపూర్, త్రిలోక్ కపూర్ సోదరులు సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. వారికి రెండవ జనరేషన్ గా రాజ్ కపూర్-షమ్మీ కపూర్, రవీందర్ కపూర్, దేవేందర్ కపూర్ ఊర్మిళ కపూర్ తన మార్క్ ను చూపించారు.

 షారుఖ్ తో ఎమోషనల్ నటన.. దివ్యభారతితో స్టెప్పులేసి మెప్పించిన రిషీ కపూర్..

షారుఖ్ తో ఎమోషనల్ నటన.. దివ్యభారతితో స్టెప్పులేసి మెప్పించిన రిషీ కపూర్..

తర్వాత షమ్మి కపూర్ భారత సినీ లోకాన్ని శాసిస్తున్న తరుణంలో నెమ్మదిగా సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టారు రిషీ కపూర్. తన పూర్వీకుల వంశ పారంపర్యాన్ని పుణికి పుచ్చుకున్న రిషీ కపూర్ తీరుగులేని, ఎదురులేని నటుడిగా ఎదిగిపోయారు. రిషీ కపూర్ భావోద్వేగ నటన, నృత్యాలు భారత ప్రేక్షకులను ఎంతగానే ఆకర్షించాయి. చాందిని, దీవానే సినిమాల్లో భగ్న ప్రేమికుడిగా రిషీ కపూర్ చూపించిన నటన ప్రేక్షకుల చేత జేజేలు పలికించింది. చాందినీ సినిమాలో తన అందంతో
శ్రీదేవి ఆదిపత్యం ప్రదర్శిస్తే వివిద్య నటనతో శ్రీదేవితో పోటాపోటీగా నటించి ఔరా అనిపించారు రిషీ కపూర్. దీవానే సినిమాలో షారుక్ ఖాన్, దివ్యభారతిలకు ధీటుగా నటించడమే కాకుండా స్టెప్పులు వేసి మెప్పించారు రిషీ కపూర్.

  Bollywood Legend Rishi Kapoor Passes Away
   తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయిన రిషీ కపూర్.. జ్ఞాపకాలను నెమరు వేసుకున్న తోటి నటులు..

  తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయిన రిషీ కపూర్.. జ్ఞాపకాలను నెమరు వేసుకున్న తోటి నటులు..

  గత కొన్నాళ్లుగా ఓవర్ వెయిట్ కారణంగా సినిమాల్లో నటనకు దూరంగా ఉన్నారు రిషీ కపూర్. తన వారసుడిగా రణధీర్ కపూర్ ను పరిశ్రమకు పరిచయమై విజయవంతమైన సినిమాలను అందిస్తున్నారు రణధీర్ కపూర్. తండ్రికి తగ్గ తనయుడిగా ముద్ర వేసుకున్నారు రణధీర్. కాగా గత కొద్ది రోజులుగా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న రిషీ కపూర్ శారీరకంగా అనేక సమస్యలను ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. ఆరోగ్యం క్షీణించి గురువారం ఉదయం తన అబిమాన నటి చాందినీ ని వెతుక్కుంటూ వెళ్లి పోయారు. రిషీ కపూర్ మరణ వార్తను ఆయన సహచరులు అమితాబ్ బచ్చన్, హేమమాలిని, రేఖ, ధర్మేంద్ర, రాజ్ బబ్బర్ జీర్ణించుకోలేపోతున్నట్టు సందేశాలు పంపించారు. వెర్సటైల్ నటుడు రిషి కపూర్ మరణ వార్త పట్ల తెలుగు సినీ పరిశ్రమలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.

  English summary
  Rishi Kapoor made his own mark on silver screen.Rishi Kapoor's performance in Sagar Cinema, as a boy who was in a state of mental confrontation, made an indelible impression on Indian film lovers. The untimely death of Rishi Kapoor, who has grown into an irresistible spectacle in Indian cinemas, is something that the Indian film industry is unable to digest.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X