వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడునెలల గరిష్టానికి పెరిగిన ద్రవ్యోల్బణం..నవంబర్ నెలకు 5.5శాతంగా నమోదు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెరుగుతున్న ఆహార ధరలు నిత్యావసర వస్తువులతో రిటైల్ ద్రవ్యోల్బణం మూడేళ్ల గరిష్టానికి చేరుకుంది. నవంబర్ నెలకు గాను రిటైల్ ద్రవ్యోల్బణం 5.54శాతంగా రికార్డ్ అయ్యింది. ఇదిలా ఉంటే పారిశ్రామిక రంగం ఉత్పత్తి వరుసగా మూడోనెలలో కూడా పడిపోయింది. అక్టోబర్ నెలకు 3.8శాతంగా రికార్డు అయ్యింది. ప్రభుత్వం గురువారం విడుదల చేసిన గణాంకాలు ఆర్థిక రంగం మందగమనంను సూచిస్తున్నాయి.

ఆహార ధరల పెరుగుదలే కారణం

ఆహార ధరల పెరుగుదలే కారణం

ఇదిలా ఉంటే రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన 4శాతం ద్రవ్యోల్బణంకు దిగువన నవంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం పడిపోయింది. ఈ నెల ప్రారంభంలో రిజర్వ్ బ్యాంక్ బెంచ్ మార్క్ వడ్డీ రేట్లను యతాథతంగా ఉంచడానికి గల కారణం ఇదొకటని నిపుణులు చెబుతున్నారు. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన లెక్కల ప్రకారం కూరగాయల ధరల పెరుగుదల, పప్పు దినుసుల పెరుగుదల, ప్రొటీన్లు కలిగిన వస్తువుల ధరల పెరుగుదలతో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గత 40 నెలల్లో ఎప్పుడూ లేనంతగా నవంబర్ నెలలో పెరగడం విశేషం.

 మూడు నెలల గరిష్టానికి చేరిన ద్రవ్యోల్బణం

మూడు నెలల గరిష్టానికి చేరిన ద్రవ్యోల్బణం

అంతకుముందు జూలై 2016 రిటైల్ ద్రవ్యోల్బణం అత్యధికంగా 6.07 ఉండగా 2019 నవంబర్ నెలలో అది 5.54శాతానికి చేరింది. 2018 అక్టోబర్ నెలలో ఇది 4.62 రికార్డు కాగా నవంబర్‌లో ఇది 2.33 శాతంగా నమోదైంది. మరోవైపు సీపీఐ ద్రవ్యోల్బణం డిసెంబరు 2019కి మరింతగా పెరిగి 5.8 నుంచి 6 శాతానికి చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ గణాంకాలు చూశాక ఫిబ్రవరి 2020లో జరిగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో వడ్డీ రేట్లను మళ్లీ యథాతథంగానే ఉంచుతారనే ఆశిస్తున్నట్లనిపుణులు చెబుతున్నారు.

 పడిపోయిన ఫ్యాక్టరీ ఔట్‌పుట్

పడిపోయిన ఫ్యాక్టరీ ఔట్‌పుట్

ఇక ఫ్యాక్టరీ ఔట్‌పుట్ సెప్టెంబర్ నెలకు 4.3శాతంకు పడిపోగా, ఆగష్టు నెలకు 1.4శాతంగా రికార్డు అయ్యింది. జూలైలో ఇది 4.9శాతంగా ఉన్నింది.అక్టోబర్ 2018లో ఫ్యాక్టరీ ఔట్‌పుట్ 8.4శాతంగా ఉన్నింది. ఈ ఏడాది అక్టోబరులో ఉత్పత్తి వృద్ధి రేటు 2.1 శాతానికి పడిపోయింది. ఇక విద్యుత్ ఉత్పత్తి వృద్ధి అక్టోబర్ నెలకు 12.2 శాతానికి పడిపోయిందని లెక్కలు చెబుతున్నాయి. ఇదే సమయానికి గతేడాది విద్యుత్ ఉత్పత్తి 10.8శాతంగా ఉన్నింది. ఇక పరిశ్రమల పరంగా చూస్తే 23 ప్రధాన పరిశ్రమల్లో 18 పరిశ్రమలు నష్టాల బాట పయనించాయి.

English summary
Rising food prices pushed the retail inflation in November to over three-year high of 5.54 per cent, while the industrial sector output shrank for third month in a row by 3.8 per cent in October, indicating deepening slowdown in the economy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X