వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసహనం, దాడులు ఆర్థికవృద్ధికి ప్రతిబంధకం : ఆది గోద్రెజ్

|
Google Oneindia TeluguNews

ముంబై : ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆది గోద్రేజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాపార నిర్వహణలో ఎప్పుడూ బిజీగా ఉంటే ఆయన శనివారం ముంబైలోని ఓ కాలేజీ వార్షికోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశంలో ప్రస్తుతం నెలకొన్న సిచుయేషన్‌పై సునిశీతంగా కామెంట్ చేశారు. దేశంలో అసహనం పెరిగిపోతుందన్నారు. కుల, మతాల పేరుతో జరుగుతున్న దాడులు ఆర్థిక ప్రగతికి అవరోధంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.

పెరుగుతున్న అసహనం ..
ముంబైలోకి సెయింట్ గ్జేవియర్ కాలేజీ 150వ వార్షికోత్సవం జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ఆది గోద్రెజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో అసహనం పెరిగిపోతుందన్నారు. ఇది మనకు అంత మంచిది కాదన్నారు. కుల, మతాల పేరుతో జరుగుతున్న దాడులను కూడా తప్పుపట్టారు. ఈ కాలంలో కూడా వర్ణ వివక్ష ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇవన్నీ దేశ ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశాభివృద్ధిపై ముందుచూపు ఉన్న ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపారు.

Rising Intolerance, Hate Crimes Can Seriously Damage Growth: Adi Godrej

ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లు చేస్తామని ప్రకటించడాన్ని స్వాగతించారు. దీంతో మన ఆర్థిక వ్యవస్థ రెట్టింపు అవుతుంది.. ఆనందమే కానీ ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలే ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. దీంతో సామాజిక అస్థిరత్వం ఏర్పడుతుందని హెచ్చరించారు. ఇది ఆర్థిక వృద్ధికి ప్రతిబంధకంగా మారే ప్రమాదం ఉందని అలర్ట్ చేశారు.

దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. హింస ఈ స్థాయిలో పెరగడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. ఇది సమాజానికి మంచిది కాదని సూచించారు. దీంతోపాటు గత నాలుగు దశాబ్ధాల్లో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగిత 6.1 శాతానికి చేరడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతోపాటు ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా వాడటం, ఆరోగ్య భద్రత లేకపోవడంపై ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో మంచినీరు దొరకని దుర్భర పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.

English summary
Noted industrialist Adi Godrej Saturday warned that the rising intolerance, hate crimes and moral policing can "seriously damage" economic growth of the nation. Adi Godrej, however, congratulated Prime Minister Narendra Modi for presenting a "grand vision" to build a new India and nearly double economy to a $5 trillion giant over the course of his second term in office. He was quick to add that all is not well in the country and pointed out a slew of concerns on the social front, warning of their impact on growth as well.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X