వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ర్యాట్ హోల్: 12 రోజుల క్రితం మైన్స్‌లో చిక్కుకున్న 15మంది, రెస్క్యూ ఆపరేషన్

|
Google Oneindia TeluguNews

గౌహతి: మేఘాలయలోని ఈస్ట్ జైంతియా హిల్స్ జిల్లాలోని లుంతారీ గ్రామం క్సాన్ పరిధిలోని కోల్ మైన్స్‌లో దాదాపు పదిహేను మంది చిక్కుకుపోయారు. మైన్స్‌లో డిసెంబర్ 13వ తేదీన చిక్కుకున్నారు. వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ సహా రెస్క్యూ టీం మైన్స్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అహర్నిషలు కృషి చేస్తోంది. వారు మైన్స్‌లో చిక్కుకొని దాదాపు రెండు వారాలు కావొస్తుంది.

తాజాగా, సోమవారం సహాయక చర్యలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. నీరు పెరుగుతుండటం సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోంది. ఇది అక్రమ మైనింగ్‌గా తెలుస్తోంది. పదిహేను మంది 370 అడుగుల లోతులో చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.

ఎన్డీఆర్ఎఫ్, జిల్లా అధికారులు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. 25 హార్స్ పవర్ పంపులు రెండింటిని ఉపయోగించి నీటిని తోడేస్తున్నారు 100 హార్స్ పవర్ పంపుల ద్వారా నీటిని తోడేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధపడ్డారు.

Rising Water As Rescuers Hunt For Meghalaya Miners Trapped For 2 Weeks

సమాచారం మేరకు మైన్స్‌లో చిక్కుకున్న వారు అందరు కూడా జీవించే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అన్ని రకాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

డిసెంబర్ 13వ తేదీన దాదాపు 20 మంది మైనింగ్ వర్కర్స్ లోనికి వెళ్లారు. వారు లోపలకు వెళ్లాక ర్యాట్ హోల్స్‌లో చిక్కుకుపోయారు. అవి చాలా ఇరుకుగా ఉన్నాయి. ఐదుగురు బయటకు రాగలిగారు. మరో 15 మంది అందులోనే చిక్కుకుపోయారు.

English summary
The search and rescue operations to look for 15 miners trapped since December 13 at a rat-hole mine in Meghalaya have stopped now. Two 25-horsepower (hp) pumps used to drain out the flooded illegal mine in the state's East Jaintia Hills were ineffective, officials said. Water from a nearby river kept flooding the mine, they said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X