వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా: సెహ్వాగ్-గుర్మెహర్‌కు ఆర్జే నవేద్

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని గుర్మెహర్‌ కౌర్‌కు, భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌కు ఓ విషయం చెప్పదలుచుకున్నట్లు రేడియో మిర్చి ఆర్జే నవేద్‌ పేర్కొన్నారు.

|
Google Oneindia TeluguNews

ముంబై: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని గుర్మెహర్‌ కౌర్‌కు, భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌కు ఓ విషయం చెప్పదలుచుకున్నట్లు రేడియో మిర్చి ఆర్జే నవేద్‌ పేర్కొన్నారు.

కార్గిల్‌ అమర సైనికుడి కుమార్తె గుర్మెహర్‌ రాంజాన్‌ కాలేజీ అల్లర్ల నేపథ్యంలో సోషల్‌మీడియాలో చేసిన పోస్ట్‌ దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే.

పాకిస్థాన్‌ తన తండ్రిని హతమార్చలేదని, యుద్ధం హతమార్చిందని గుర్మెహర్‌ ప్లకార్డు పట్టుకుని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. దీనిపై క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ స్పందిస్తూ.. తాను మూడు శతకాలు చేయలేదని, తన బ్యాట్‌ చేసిందని కౌంటర్ ఇచ్చారు.

RJ Naved Has A Message For Gurmehar And Sehwag

అయితే ఈ సంఘటనపై తాజాగా రేడియో మిర్చి ఆర్జే నవేద్‌ స్పందించారు. తన అభిప్రాయాన్ని ప్లకార్డుల ద్వారా తెలుపుతూ మార్చి 2న ఒక వీడియోను అప్‌లోడ్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

దాదాపు మూడు లక్షల మంది దీన్ని చూశారు. ప్రియమైన గుర్మెహర్‌ కౌర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌.. మీ ఇద్దరి నేనొకటి చెప్పాలనుకుంటున్నానని, మీకే కాదు దేశంలోని జాతీయవాదులకు, వ్యతిరేక జాతీయవాదులకు, పాకిస్థాన్‌ వెళ్లాలనుకునే వారికి తాను ఓ విషయం చెప్పాలనుకుంటున్నానని, కాగితాన్ని వృథా చేయడం ఆపండని నవేద్‌ వీడియోలో ప్లకార్డులు చూపించారు.

English summary
A few days ago, cricketer Virender Sehwag found himself in the middle of a controversy when he tweeted a photo of himself holding a placard that read "I didn't score two triple centuries. My bat did." The tweet resulted in a deluge of reactions as it was tweeted in reference to a similar picture by Delhi University student, Gurmehar Kaur, holding a placard to condemn war. Ms Kaur's placard had read "Pakistan did not kill my dad, war killed him."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X