• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీహార్: నితీశ్ సర్కారుకు గండం -ఆర్జేడీలోకి 17మంది జేడీయూ ఎమ్మెల్యేలు! -సీఎం ఘాటు రియాక్షన్ అరుణాచల్ ప్రదేశ్ లో

|

అరుణాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాల ప్రభావం బీహార్ పై ఇంకా బలంగానే కొనసాగుతున్నది. అరుణాచల్ లో ఏడుగురు జేడీయూ ఎమ్మెల్యేలకుగానూ ఆరుగురు బీజేపీలో చేరడంతో దోస్తీ పేరిట కాషాయదళం మోసపుచ్చుతోందని జేడీయూ మండిపడింది. నితీశ్ కుమార్ మరో అడుగు ముందుకేసి, బీహార్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటానని, ఆ సీటును బీజేపీనే తీసుకోవాలని అన్నారు. బీజేపీ-జేడీయూ మధ్య విభేదాలు సర్కారు పతనానికి దారితీస్తాయనే చర్చ సాగుతుండగానే ప్రతిపక్ష ఆర్జేడీ మరో బాంబు విసిరింది..

తిరుపతిలో ఘోరం: భార్య అందాలే పెట్టుబడిగా భర్త వ్యాపారం -ఓయో రూమ్‌లో గంటకు రూ.3వేలంటూ<br>తిరుపతిలో ఘోరం: భార్య అందాలే పెట్టుబడిగా భర్త వ్యాపారం -ఓయో రూమ్‌లో గంటకు రూ.3వేలంటూ

ఆర్జేడీలోకి 17 మంది జేడీయూ సభ్యులు..

ఆర్జేడీలోకి 17 మంది జేడీయూ సభ్యులు..

బీజేపీ చేస్తున్న మోసంతో విసిగిపోయిన జేడీయూ ఎమ్మెల్యేలు 17మంది పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని, వారంతా మూకుమ్మడిగా ఆర్జేడీలో చేర‌డానికి సిద్ధంగా ఉన్నాంటూ ఆర్జేడీ కీలక నేత శ్యామ్ ర‌జాక్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.‘‘ఆ 17 మంది జేడీయూ ఎమ్మెల్యేలు ఏ క్ష‌ణ‌మైనా ఆర్జేడీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కానీ 17 మంది సరిపోరు, మొత్తం 28 మంది ఎమ్మెల్యేలు ఒక గ్రూప్‌ ఏర్పడి ఆర్జేడీలోకి రావాల్సిందిగా సూచించాం. అప్పుడు తప్పకుండా నితీశ్ స‌ర్కారు కుప్ప‌కూలుతుంది''అని రజాక్ పేర్కొన్నారు. మొత్తం 43 సీట్లున్న జేడీయూలో 28 మంది ఎమ్మెల్యేలు ఆర్జేడీలోకి జంప్ అయితే, శాసనసభా పక్షం విలీనం అయినట్లవుతుందని, తద్వారా అనర్హత వేటు నుంచి తప్పించుకోవచ్చనే ఉద్దేశంతోనే ఆర్జేడీ నేత రజాక్ ఆ సంఖ్యను సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు..

సీఎం తేజస్వీ.. పీఎం నితీశ్..

సీఎం తేజస్వీ.. పీఎం నితీశ్..

జేడీయూకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరేందుకు సిద్ధమయ్యారని శ్యామ్ రజాక్ మీడియా ముఖంగా చెప్పడానికి కొద్ది గంటల ముందు.. ఆర్జేడీకే చెందిన మరో సీనియర్ నేత, బీహార్ మాజీ స్పీకర్ ఉదయ్ నారాయణ్ చౌదరి అనూహ్య ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. నితీష్ కుమార్ బీజేపీతో మైత్రిని వదిలి ఆర్జేడీతో చేతులు కలపాలని, బీహార్ కు సీఎంగా తేజస్వీ యాదవ్ కు మద్దతిస్తే, ప్రధాని అభ్యర్థిగా నితీశ్ కుమార్ కు ఆర్జేడీ మద్దతు ఇస్తుందని చౌదరి అన్నారు. కాగా,

 ఆర్జేడీకి అంత సీన్ లేదు..

ఆర్జేడీకి అంత సీన్ లేదు..

బీహార్ లో ఎన్డీఏ సర్కారు కూలడం ఖాయమని, జేడీయూ ఎమ్మెల్యేలు 17 మంది ఆర్జేడీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ప్రతిపక్ష నేతలు చేసిన కామెంట్లపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఘాటుగా స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆర్జేడీ నేత రజాక్ క్లెయిమ్ ను తోసిపుచ్చారు. ఆర్జేడీకి అంత సీన్ లేదనే అర్థంలో ‘అవన్నీ నిరాధారమైన వ్యాఖ్యలు'అని స్పష్టం చేశారు. అయితే, బీజేపీతో సంబంధాలు ఎలా ఉన్నాయన్న ప్రశ్నకు మాత్రం ఆయన బదులివ్వకుండా వెళ్లిపోయారు.

రామతీర్థం విధ్వంసం: మరో సంచలనం -జగన్‌పై మోదీకి వైసీపీ ఎంపీ ఫిర్యాదు -కేంద్ర బృందాలురామతీర్థం విధ్వంసం: మరో సంచలనం -జగన్‌పై మోదీకి వైసీపీ ఎంపీ ఫిర్యాదు -కేంద్ర బృందాలు

English summary
Bihar Chief Minister Nitish Kumar on Wednesday dismissed as "totally baseless" the claim by opposition Rashtriya Janata Dal leader Shyam Rajak who said that 17 MLAs of ruling Janata Dal (United) or JD(U) are in touch with the RJD and more will cross over very soon. While talking to ANI, Rajak, who joined the RJD before the Assembly elections said that the defection of the MLAs has been put on hold since the RJD hoped that more would like to follow suit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X