వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాలూప్రసాద్ యాదవ్ ఆరోగ్యం ఏ క్షణమైనా క్షీణించొచ్చు..25 శాతం కిడ్నీలు మాత్రమే పనిచేస్తోన్నాయి

|
Google Oneindia TeluguNews

ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంగా ఉన్నారు. పశు దాణా కుంభకోణం కేసులో జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే షుగర్ వల్ల ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. 20 ఏళ్లుగా ఆయనకు షుగర్ ఉంది. దీంతో కిడ్నీలు దెబ్బతింటూ వస్తున్నాయి. ఇప్పుడు 25 శాతం కిడ్నీ మాత్రమే పనిచేస్తున్నాయని.. ఏ క్షణమైనా ఆరోగ్యం విషమించొచ్చు అని చికిత్స అందిస్తోన్న వైద్యుడు డాక్టర్ ప్రసాద్ తెలియజేశారు.

లాలూ ఆరోగ్య పరిస్థితి గురించి రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అధికారులకు తెలియజేశానని డాక్టర్ ప్రసాద్ తెలిపారు. లాలూ ప్రసాద్ కిడ్నీ పనితీరు మరింత దిగజారచ్చు అని పేర్కొన్నారు. లాలూ ప్రసాద్ గత 20 ఏళ్లుగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో కిడ్నీ దెబ్బతింటూ వచ్చింది.

RJD Leader Lalu Prasad Yadav Kidney Function Can Deteriorate Anytime: RIMS Doctor

డయాబెటిస్ కారణంగా కిడ్నీ దెబ్బతిన్నందున ఇతర వైద్యం కోసం మరోచోటికి తరలించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అయితే అదీ తన వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నారు. వ్యాధిని ఏ మందూ నయం చేయలేదని ప్రసాద్ అన్నారు. రిమ్స్‌లో కాకుండా మరో చోట చికిత్స చేయించినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని అన్నారు. రిసెడెంట్ నెఫ్రాలజిస్టును సంప్రదించి చికిత్సపై నిర్ణయానికి రావాలని తాము భావిస్తున్నట్టు చెప్పారు.

English summary
kidney function of former Bihar Chief Minister and RJD President Lalu Prasad Yadav can get worse anytime, Dr Umesh Prasad of Rajendra Institute of Medical Sciences in Ranchi said on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X