వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిక్కెట్టు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటా: ఎంఎల్ఏ

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు పోటి చెయ్యడానికి అవకాశం ఇవ్వాలని, టిక్కెట్టు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ శాసన సభ్యుడు ఆర్జేడీ నాయకులను హెచ్చరించాడు. టిక్కెట్టు ఇచ్చే వరకు తాను నిద్రపోనని నిరాహార దీక్ష మొదలు పెట్టాడు.

బీహార్ లోని బోజ్ పూర్ జిల్లా జగదీష్ పూర్ అసెంబ్లీ నియోజక వర్గం శాసన సభ్యుడు బాయి దినేష్ ఆర్జేడీ పెద్దలకు తలనొప్పిగా తయారైనాడు. ప్రస్తుతం బాయి దినేష్ శాసన సభ్యుడు. 2010లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భగవాన్ సింగ్ కుష్వాహా ను ఓడించాడు.

 RJD legislator Bhai Dinesh on Saturday began a hunger strike in Bihar

భగవాన్ సింగ్ కుష్వాహా మీద ఘనవిజయం సాధించాడు. అయితే 2015 అసెంబ్లీ ఎన్నికలలో జగదీష్ పూర్ నియోజక వర్గంలో ఓడిపోయిన భగవాన్ సింగ్ కుష్వహా ను అక్కడి నుంచి బరిలో దించాలని లాలూ ప్రసాద్ యాదవ్ భావిస్తున్నారని స్థానిక మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.

తన చేతిలో ఓడిపోయిన వ్యక్తికి మీరు ఎలా టిక్కెట్టు ఇస్తారు, తాను ఈ నియోజక వర్గం నుంచి కచ్చితంగా గెలుస్తానని సర్వేలు కూడ చెబుతున్నాయని బాయి దినేష్ పార్టీ పెద్దలను ప్రశ్నిస్తున్నారు. ఆదివారం లోపు తనకు టిక్కెట్టు ఇవ్వకుంటే పార్టీ కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు.

English summary
RJD legislator Bhai Dinesh on Saturday began a hunger strike in the party office here demanding a ticket for the Bihar assembly polls and threatened to set himself afire if the request was denied.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X