• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కళంక విద్యాశాఖామంత్రి అంటూ .. బీహార్ లో నితీష్ క్యాబినెట్ టార్గెట్ గా ఆర్జేడీ ధ్వజం

|

బీహార్ ఎన్నికలు ముగిసి ఎన్డీఏ ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా బీహార్లో రాజకీయం ఇంకా రసవత్తరంగా కొనసాగుతోంది. బీహార్‌లో ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేను విద్యాశాఖ మంత్రిగా నియమించడంపై వివాదం చెలరేగింది. ప్రస్తుతం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి వ్యవహారం ప్రతిపక్ష ఆర్జెడికి ఆయుధంగా మారింది .

మేవలాల్ చౌదరిని విద్యాశాఖా మంత్రిగా నియమించడంపై ఆర్జెడి అభ్యంతరం

మేవలాల్ చౌదరిని విద్యాశాఖా మంత్రిగా నియమించడంపై ఆర్జెడి అభ్యంతరం

అవినీతి ఆరోపణలు ఉన్న జెడియు శాసనసభ్యుడు మేవలాల్ చౌదరిని విద్యాశాఖా మంత్రిగా నియమించడంపై ఆర్జెడి అభ్యంతరం వ్యక్తం చేసింది. మైనారిటీ వర్గాలకు చెందిన శాసనసభ్యులను విస్మరిస్తూ, అవినీతి ఆరోపణలు ఉన్న కళంక నేతకు విద్యాశాఖ మంత్రిగా పట్టం కట్టి ఉద్ధరించే నిర్ణయంపై అధికార బిజెపి-జెడియుల సంయుక్త ఎన్డీయే కూటమిని ఆర్జేడీ ప్రశ్నించింది.

అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు జూనియర్ సైంటిస్ట్ పోస్టుల నియామకాల్లో, యూనివర్సిటీ భవన నిర్మాణాలలో అవినీతి, అవకతవకలకు సంబంధించి మేవలాల్ చౌదరి ఆరోపణలు ఎదుర్కొన్నారు.

మేవలాల్ చౌదరిపై అవినీతి ఆరోపణలు .. అవన్నీ నిరాధారమన్న మంత్రి

మేవలాల్ చౌదరిపై అవినీతి ఆరోపణలు .. అవన్నీ నిరాధారమన్న మంత్రి

2017 లో ఆయన భాగల్ పూర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గా ఉన్నప్పుడు ఈ ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమని మేవలాల్ చౌదరి కొట్టిపారేశారు.

తన ఎన్నికల అఫిడవిట్లో తనపై నమోదైన అవినీతి కేసు గురించి ప్రస్తావించలేదని పేర్కొన్న ఆయన, తనపై కేసు పెండింగ్లో ఉందని, చార్జిషీటు కూడా దాఖలు చేయలేదని, దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. కేసు పెట్టినంత మాత్రాన నేరం చేసినట్లు కాదని , అవినీతిపరుడైన తేజస్వి యాదవ్ ఇతరులను వేలు పెట్టి చూపించవద్దని మండిపడ్డారు మేవలాల్ చౌదరి .

మేవలాల్ చౌదరి విద్యామంత్రిగా నియామకం .. నితీష్ దోపిడీకి నిదర్శనం : ఆర్జేడీ ఫైర్

మేవలాల్ చౌదరి విద్యామంత్రిగా నియామకం .. నితీష్ దోపిడీకి నిదర్శనం : ఆర్జేడీ ఫైర్

రాష్ట్రంలో చాలా మంది శాసనసభ్యులపై కేసులు ఉన్నాయని పేర్కొన్న ఆయన తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు.

ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మేవలాల్ చౌదరిని విద్యాశాఖ మంత్రిగా నియమించడంపై నితీష్ సర్కార్ పై మండిపడ్డారు. అధికారం నేరస్థులను రక్షిస్తోంది ... మేవాలాల్ చౌదరిని నియమించడం ద్వారా దోపిడీకి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మినహాయింపు ఇచ్చారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తన కుర్చీని కాపాడటానికి నేరాలు, అవినీతి ఆరోపణలు ఉన్న వారిని మంత్రులుగా నియమిస్తారు అంటూ అసహనం వ్యక్తం చేశారు.

 ప్రతిపక్షాలకు ఆయుధంగా, పెద్ద వివాదంగా మారిన విద్యామంత్రి నియామకం

ప్రతిపక్షాలకు ఆయుధంగా, పెద్ద వివాదంగా మారిన విద్యామంత్రి నియామకం

మైనారిటీలలో ఎవరిని మంత్రిగా చేశారని ప్రశ్నించారు తేజస్వి యాదవ్. మేవలాల్ చౌదరి తారాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన 2017 లో జెడియు నుండి సస్పెండ్ చేయబడ్డాడు తర్వాత తిరిగి జెడియు లోనే కొనసాగాడు. ప్రస్తుతం బీహార్ క్యాబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు.


అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న , కోర్టుల్లో కేసులను ఎదుర్కొంటున్న మేవలాల్ చౌదరి కి విద్యా శాఖామంత్రిగా అవకాశం ఇవ్వటం ఇప్పుడు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది.

English summary
Within two days of government formation in Bihar a controversy has erupted over the appointment of corruption-accused Janata Dal United (JDU) legislator, Mewalal Choudhary, as the Education Minister. State's main opposition party, Rashtriya Janata Dal, has questioned the ruling BJP-JDU combine over the decision to elevate the tainted leader while ignoring legislators from minority communities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X