వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ విందుకు ఆర్జేడీ డుమ్మా .. ఎందుకో తెలుసా ..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : 17వ లోక్‌సభకు తొలిరోజు హాజరైన సభ్యులకు ప్రధాని నరేంద్ర మోడీ విందు ఇస్తామని ప్రకటించారు. ఇవాళ రాత్రి ఎంపీలంతా డిన్నర్‌కు రావాలని సూచించారు. అయితే బీహర్‌లో ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ మాత్రం విందుకు హాజరుకాబోమని తేల్చిచెప్పింది.

నో విందు ..
ఇటీవల బీహర్‌లో మెదడువాపు వ్యాధితో పిల్లలు పిట్టల్లా రాలిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ కొందరు పిల్లలకు వైద్యం అందిస్తున్నారు. ఈ క్రమంలో తమ ఎంపీలు విందుకు హాజరుకాబోరని ఆ పార్టీ నేత మిసాభారతి స్పష్టంచేశారు. అయితే విందుకయ్యే వ్యయంతో పిల్లలకు మందులు, ఇతర వస్తువులు కొనుగోలు చేయొచ్చు కదా అని సూచించారు. మెదడువాపు వ్యాధితో ఇప్పటికే రాష్ట్రంలో 136 మంది పిల్లలు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా చేయాలని ఆర్జేడీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో మెదడువాపు వ్యాధి ప్రబలితే .. సర్కార్ చేష్టలుడిగి చూసిందే .. తప్ప సహాయక చర్యలు చేపట్టలేదని విమర్శించారు.

ఏం చేశారు ...?

RJD to boycott dinner hosted by PM Modi, says use money to buy medicines for dying kids
గత 14 ఏళ్లుగా బీహర్‌ను నితీశ్ కుమార్ పాలిస్తున్నారు. అయితే వివిధ ఆరోగ్య సమస్యలతో మరణించే వారి సంఖ్యను తగ్గించగలిగారా ? అని రబ్రి దేవి ప్రశ్నించారు. కానీ రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటించి .. చేతులు దులుపుకుంటుందే తప్ప బాధితులకు బాసటగా నిలిచిన దాఖలాలు లేవని మోడీపై విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. దీంతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కూడా ధ్వజమెత్తారు. వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై ఇండియా గెలిస్తే కంగ్రామ్స్ చెప్పారు .. మరి బీహర్‌లో విజృంభిస్తోన్న మెదడువాపు వ్యాధి సంగతేంటని ప్రశ్నించారు. పాకిస్థాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్ కాదు .. మెదడు వాపుపై దాడి చేయాలని సూచించారు.
English summary
the main opposition party in Bihar, Lalu Yadav's Rashtriya Janata Dal has said it will be boycotting a dinner hosted by PM Modi in protest over the encephalitis outbreak in the state. Talking to news agency ANI, RJD leader Misa Bharti said that the party will not be attending the prime minister's dinner for all parliamentarians today. Hitting out at the event, Misa Bharti said, "Medicines and live equipment can be procured from the amount that is being spent in organizing this dinner."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X