వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంతకంటే దారుణమా?: ఆర్కే నగర్‌లో పరువు పోగొట్టుకున్న బీజేపీ

|
Google Oneindia TeluguNews

ఆర్కే నగర్: ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంది. ఆ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు రావడం గమనార్హం. తమిళనాడులో, ముఖ్యంగా దక్షిణాదిన పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్న ఆ పార్టీకి ఇది చేదు అనుభవం.

జయ వారసుడు దినకరన్!: మంత్రులు-అన్నాడీఎంకే రివర్స్, శశికళవైపు చూపుజయ వారసుడు దినకరన్!: మంత్రులు-అన్నాడీఎంకే రివర్స్, శశికళవైపు చూపు

నోటాకు వచ్చిన ఓట్లు కూడా బీజేపీకి రాలేదు. తొలి రౌండ్ నుంచి బీజేపీ కనీస ప్రభావం కూడా చూపించలేకపోయింది. 8 రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీకి 519 ఓట్లు రాగా, నోటాకు 1732 ఓట్లు వచ్చాయి. దీనిపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి తనదైన రీతిలో స్పందించారు.

జయ వారసుడ్ని, మూణ్ణెళ్లు వెయిట్&సీ: దినకరన్, బీజేపీ రికార్డ్ అంటూ సుబ్రహ్మణ్యస్వామి ఎద్దేవాజయ వారసుడ్ని, మూణ్ణెళ్లు వెయిట్&సీ: దినకరన్, బీజేపీ రికార్డ్ అంటూ సుబ్రహ్మణ్యస్వామి ఎద్దేవా

 కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి

బీజేపీ తమిళనాడులోని ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో రికార్డ్ సృష్టించిందని, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడ నోటాలో మూడో వంతు ఓట్లు సాధించిందని సుబ్రహ్మణ్య స్వామి ఎద్దేవా చేశారు. బాధ్యత తీసుకోవాల్సిన సమయం ఇది అన్నారు.

 దినకరన్ సత్తా

దినకరన్ సత్తా

ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ విజయం దిశగా సాగుతుండగా ఆ తర్వాత అన్నాడీఎంకే, డీఎంకే వర్గాలు ఉన్నాయి. అయితే ఈ పార్టీలకు ఆయన అందనంత దూరంలోకి వెళ్లిపోయారు. గెలుపు ఖాయమైంది.

 సత్తాచాటలేకపోయిన బీజేపీ

సత్తాచాటలేకపోయిన బీజేపీ

దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అన్నాడీఎంకే నుంచి మధుసూదనన్, డీఎంకే నుంచి మరుధు గణేష్ పోటీ చేశారు. బీజేపీ నుంచి కారు నాగరాజన్ బరిలో నిలిచారు. 12 రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీ 1,126 ఓట్లు, నోటాకు 19వేల పై చిలుకు ఓట్లు వచ్చాయి.

 బీజేపీతో పాటు విపక్షాల అనుమానం

బీజేపీతో పాటు విపక్షాల అనుమానం

ఆర్కే నగర్ ఉప ఎన్నికలపై తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు, ఇతర పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవి ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికల్లా కనిపించడం లేదని బీజేపీ అభ్యర్థి నాగరాజు అన్నారు. అంతా డబ్బుమయమైందని బీజేపీ అధ్యక్షురాలు అన్నారు. అయితే, దినకరన్ దరిదాపుల్లోకి అన్నాడీఎంకే, డీఎంకేలు కూడా రాలేదు. దీంతో దీనిపై విపక్షాలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

English summary
"All is money," BJP candidate Karu Nagaraj lamented after Prime Minister Narendra Modi's party, so used to being an election-winning machine, found itself trailing the NOTA (None Of The Above) option after eight rounds of counting in the RK Nagar bypoll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X