వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి వీస్తోందని..: రజనీతో బీజేపీ అభ్యర్థి-వారి మధ్య ఏం జరిగిందంటే..!

ఆర్కే నగర్ బీజేపీ అభ్యర్థి గంగై అమరన్ మంగళవారం ఉదయం సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఏప్రిల్ 12న ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఆర్కే నగర్ బీజేపీ అభ్యర్థి గంగై అమరన్ మంగళవారం ఉదయం సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఏప్రిల్ 12న ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సూపర్ స్టార్ మద్దతు కోసమే బీజేపీ అభ్యర్థి రజనీని కలిశారు. భేటీ అనంతరం గంగై అమరన్ మాట్లాడుతూ.. తనకు తలైవా మద్దతు ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

<strong>నిన్న మోడీ: బీజేపీ కొత్త ట్విస్ట్... రజనీకాంత్‌ను కల్సిన ఆర్కే నగర్ అభ్యర్థి </strong>నిన్న మోడీ: బీజేపీ కొత్త ట్విస్ట్... రజనీకాంత్‌ను కల్సిన ఆర్కే నగర్ అభ్యర్థి

రజనీకాంత్ బీజేపీలో చేరుతారా అనే చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సాగుతోంది. గతంలో బీజేపీకి అనుకూలంగా సొంత పార్టీ పెడతారనే చర్చ కూడా సాగింది. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి కలవడం చర్చకు దారి తీసింది.

సోషల్ మీడియాలో చర్చ

సోషల్ మీడియాలో చర్చ

అదే సమయంలో రజనీకాంత్ ఉద్దేశ్యంపై చర్చ కూడా సాగుతోంది. రజనీకాంత్‌తో బీజేపీ అభ్యర్థి ఫోటోను ఉద్దేశించి... అరుణేష్ నారాయణ్ అనే యూజర్ 'ఇది సంకేతమా' (బీజేపీలో చేరేందుకు లేదా, బీజేపీతో కలిసేందుకు) అని ట్వీట్ చేశారు.

మరో యూజర్ శ్రీనివాస్.. 'కబాలి నిజ జీవితంలో చాలా సింపుల్. అతను బీజేపీలో చేరితే తమిళనాడుకు తదుపరి ముఖ్యమంత్రి కాగలిగిన సామర్థ్యం ఉన్నవారు. గుడ్ లక్' అని ట్వీట్ చేశారు. దేశంలో ఇప్పుడు ఏ పార్టీకి గాలి వీస్తుందే రజనీకాంత్‌కు తెలుసునని మరొకరు ట్వీట్ చేశారు.

వారి మధ్య ఏం జరిగింది?

వారి మధ్య ఏం జరిగింది?

రజనీకాంత్-బీజేపీ ఆర్కే నగర్ అభ్యర్థి గంగై అమరన్ కలయికపై గంగై తనయుడు వెంకట్ ప్రభు ట్వీట్ చేశారు. తన తండ్రి రాజకీయ జీవితంలో విజయవంతం కావాలని సూపర్ స్టార్ ఆకాంక్షించారని పేర్కొన్నారు.

'ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పొలిటికల్ విక్టరీ సాధించాలని నా తండ్రిని ఈ రోజు తలైవార్ విష్ చేసారు' అని వెంకట్ ప్రభు ట్వీట్ చేశారు. ఆయన వారిద్దరు కలిసిన పోస్ట్ కూడా పెట్టారు.

శశికళపై ఆరోపణ.. పన్నీరుకు కితాబు

శశికళపై ఆరోపణ.. పన్నీరుకు కితాబు

గంగై అమరన్ 2014లో బీజేపీలో చేరారు. ఇటీవలే ఆయన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై ఆరోపణలు చేశారు. 1994లో జయలలిత తొలిసారి సీఎం అయినప్పుడు నగర శివార్లలోని తన ఆస్తిని లాగేసుకున్నారని ఆరోపించారు. అదే సమయంలో ఆయన ఏఐఏడీఎంకే రెబెల్ నేత, మాజీ సీఎం పన్నీరుసెల్వంపై ప్రశంసలు కురిపించారు. శశికళను ధిక్కరించినందుకు కితాబిచ్చారు.

ఉపఎన్నిక బరిలో..

ఉపఎన్నిక బరిలో..

జయలలిత మృతి నేపథ్యంలో ఏప్రిల్ 12వ తేదీన ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. డీఎంకే తరఫున మరుథుగణేష్ పోటీ చేస్తున్నారు. అన్నాడీఎంకే తరఫున దినకరన్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. పన్నీరు సెల్వం వర్గం నుంచి పోటీకి దిగుతున్నారు. జయ మేనకోడలు దీపా జయకుమార్ కూడా బరిలో నిలిచారు.

English summary
Social media users are speculating if superstar Rajinikanth is joining BJP!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X