వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడ్డంగా దొరికాడు.. శశికళ ఫిర్యాదు: 'దినకరన్ రాజకీయ జీవితం ఖతం'

రాజ్యసభ ఎంపీ శశికళ పుష్ప మంగళవారం నాడు ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను కలిశారు. ఓట్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికారని, కాబట్టి ఆయనపై వేటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: రాజ్యసభ ఎంపీ శశికళ పుష్ప మంగళవారం నాడు ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను కలిశారు. ఓట్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికారని, కాబట్టి ఆయనపై వేటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

దినకరన్‌పై వేటు వేయాలని

దినకరన్‌పై వేటు వేయాలని

ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తర్వాత కూడా ఆయన పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. దినకరన్‌పై చర్యలు తీసుకుంటామని ఈసీ హామీ ఇచ్చిందని చెప్పారు.

దినకరన్ రాజకీయ జీవితం ఖతం

దినకరన్ రాజకీయ జీవితం ఖతం

అన్నాడీఎంకే అమ్మ పార్టీ డిప్యూటీ కార్యదర్శి టీటీవీ దినకరన్‌ రాజకీయ జీవితం ముగిసినట్లేనని మాజీ ముక్యమంత్రి పన్నీరుసెల్వం వర్గం విమర్శిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఖాళీ ఏర్పడిన ఆర్కేనగర్‌ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడానికి ఎన్నికల సంఘం సమాయత్తమైంది.

భారీ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు రావడంతో ఎన్నికను ఈసీ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం నాయకత్వంలోని అన్నాడీఎంకే పురట్చి తలైవి అమ్మ వర్గం నాయకులు విమర్శల దాడి ప్రారంభించారు.

కుటుంబ సభ్యుల్ని కాపాడుకునేందుకు మంత్రులు బలి

కుటుంబ సభ్యుల్ని కాపాడుకునేందుకు మంత్రులు బలి

ఆర్కేనగర్‌లో నగదు పంపిణీలో దినకరన్‌ పాత్ర ఉందని ప్రపంచమంతా కోడై కూస్తుందని సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి కేపీ మునుస్వామి ఆరోపించారు. తన కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు ఆరుగురు మంత్రులను బలిపశువులను చేశారన్నారు.

లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తాం

లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తాం

తమిళనాడు ఆరోగ్య మంత్రి విజయభాస్కర్‌ నివాసంలో ఐటీ శాఖ దాడులు చేసి కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తమిళనాడులో ప్రతిపక్షం డీఎంకే నాయకులు కూడా ఓటుకు రూ.2వేల వరకు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇటువంటి కుట్రలు ఎన్ని పన్నినా తమ అభ్యర్థి మధుసూదనన్‌ లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారని మునుస్వామి ధీమా వ్యక్తం చేశారు.

English summary
Rajya Sabha MP Sasikala Pushpa today met Chief Election Commissioner and demanded for the disqualification of AIADMK (Amma) faction candidate T T V Dinakaran in the RK Nagar bypoll in Tamil Nadu over his alleged involvement in distributing money to voters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X