వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయకు చాలెంజ్ చేసింది, ఇప్పుడు ఆర్ కే నగర్ పోటీకి దిగుతున్నది ఈమె !

|
Google Oneindia TeluguNews

చెన్నై: జయలలిత మరణంతో ఖాళీ అయిన చెన్నైలోని డాక్టర్ రాధాకృష్ణన్ నగర్ (ఆర్ కే నగర్) నుంచి పోటీ చెయ్యడానికి డీఎంకే నాయకులు చాల ఆసక్తి చూపిస్తున్నారు. జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్ కే నగర్ ను సొంతం చేసుకోవాలని డీఎంకే నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

<strong>తమిళనాడుకే షాక్ ఇచ్చాడు: ఆర్ కే నగర్ లో నేనే అభ్వర్థి, పిచ్చిపట్టిందని!</strong>తమిళనాడుకే షాక్ ఇచ్చాడు: ఆర్ కే నగర్ లో నేనే అభ్వర్థి, పిచ్చిపట్టిందని!

ఆర్ కే నగర్ లో గత శాసన సభ ఉప ఎన్నికల్లో జయలలిత మీద పోటీ చేసిన సిమ్లా ముత్తుచోహన్ శుక్రవారం కరుణానిధి ఇంటికి చేరుకుని చర్చించారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటి చెయ్యడానికి మరోసారి అవకాశం కల్పించాలని ఆమె కరుణానిధి కుటుంబ సభ్యులకు మనవి చేశారు.

అలాగే నామినేషన్ వెయ్యడానికి పత్రాలు సైతం తీసుకెళ్లారని పార్టీ వర్గాలు అంటున్నాయి. గతంలో ఆర్ కే నగర్ లో జరిగిన ఉప ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి జయలలికు సిమ్లా ముత్తుచోహన్ గట్టి పోటీ ఇవ్వడానికి ప్రయత్నించారు.

RK Nagar DMK Cadres strongly opposed Simla Muthuchozhan.

అయితే జయలలిత భారీ మెజారిటీతో ఆర్ కే నగర్ నియోజక వర్గం నుంచి విజయం సాధించారు. ఇప్పుడు మళ్లీ ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిమ్లా మత్తుచోహన్ ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తం మీద మళ్లీ ఆమెకే టిక్కెట్ ఇచ్చి బరిలో నిలపడానికి డీఎంకే నాయకులు సిద్దం అవుతున్నారని సమాచారం.

ఆర్ కే నగర్ నుంచి ఎవరిని పోటీ చేయించాలని అనే విషయంపై కరుణానిధి, ఎంకే. స్టాలిన్ చర్చించి నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కలిసి ఒకే అభ్వర్థిని బరిలోకి దించడానికి సిద్దం అయ్యాయి. అయితే సిమ్లా ముత్తుచోహన్ కు టిక్కెట్టు ఇవ్వరాదని డీఎంకే కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

English summary
Sources said that DMK again to field Simla Muthuchozhan as a candidate in RK Nagar By- Poll. But DMK Cadres strongly opposed Simla Muthuchozhan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X