వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దినకరన్ దెబ్బ: ఆర్.‌కె. నగర్‌లో జయలలిత వీడియో కలిసొచ్చిందా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై: ఆర్‌కె నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి టీటీవి దినకరన్‌కు జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తీసిన వీడియో కలిసి వచ్చిందనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Recommended Video

Jayalalitha Hospital Footage Exclusive జయలలిత అపోలో ఆసుపత్రి వీడియో విడుదల

ఆర్‌కె నగర్ ఉప ఎన్నికల్లో అన్నా డిఎంకె, డిఎంకె, స్వతంత్ర అభ్యర్థిల మధ్య పోటీ నెలకొంది. స్వతంత్ర అభ్యర్థిగా నిలిచిన దినకరన్‌‌ అనుహ్యంగా రెండు పార్టీల అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లను సాధించారు. ప్రతి రౌండ్‌లో కూడ ఇదే తరహలో ఓట్లు లభించాయి.

అనుహ్యరీతిలో ఆర్‌కె నగర్ ఓటర్లు తీర్పును ఇచ్చారు. ఈ స్థానంలో డిఎంకె‌ మూడవ స్థానంలోనే నిలవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే అధికార పార్టీలో పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు కలిసి ఉన్నప్పటికీ ఈ ఎన్నికలపై పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

దినకరన్‌కు కలిసొచ్చిన జయలలిత వీడియో

దినకరన్‌కు కలిసొచ్చిన జయలలిత వీడియో

ఆర్‌కె నగర్ ఎన్నికలకు ముందుగా దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీడియోను దినకరన్ వర్గం బయటపెట్టింది. ఈ వీడియోను ఎన్నికల సంఘం ప్రసారం చేయకూడదని ఆ సమయంలోనే మీడియాను ఆదేశించింది. అయితే ఈ వీడియో ఆర్‌కె నగర్ ఓటర్లపై ప్రభావం చూపిందని విశ్లేషకులు భావిస్తున్నారు.అన్నాడిఎంకె, డిఎంకె పార్టీల ఓట్లను దినకరన్ చీల్చే అవకాశం ఉందని భావించారు. కానీ. ఈ వీడియో కారణంగా ఓటర్లంతా దినకరన్‌ వైపుకు మొగ్గుచూపారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

జయ మృతిపై ఇలా..

జయ మృతిపై ఇలా..

జయలలిత మృతిపై అనుమానాలను ఈ వీడియో కొంతలో కొంత తీర్చిందనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే ఓటర్లు దినకరన్‌ వైపుకు మొగ్గు చూపారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. ఆసుపత్రిలో జయలలిత చికిత్స తీసుకొంటున్న సమయంలో ఆమెను ఎవరికీ కలవకుండా అడ్డుకొన్నారనే ఆరోపణలున్నాయి. అయితే ఆసుపత్రిలో జయ చికిత్స తీసుకొంటున్న సమయంలో ఆమె పండ్ల రసం తీసుకొంటన్నట్టు ఉన్న వీడియోను దినకరన్ వర్గం విడుదల చేసింది.

అన్నాడిఎంకె వర్గపోరు

అన్నాడిఎంకె వర్గపోరు

అన్నాడిఎంకె వర్గపోరు కూడ ఆ పార్టీకి నష్టం కల్గించిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.పన్నీర్ సెల్వం, పళని స్వామి గ్రూపుల మధ్య ఆర్ కె నగర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే విభేధాలు మరోసారి బహిర్గతమయ్యాయంటున్నారు. ఈ పరిణామాలు కూడ అన్నాడిఎంకెకు కలిసిరాలేదనే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

జయ చూట్టూనే తిరిగిన ఆర్ కె నగర్ ఉప ఎన్నిక

జయ చూట్టూనే తిరిగిన ఆర్ కె నగర్ ఉప ఎన్నిక


తమిళనాడులోని ఆర్‌కె నగర్ ఉప ఎన్నికలు జయలలిత చుట్టూనే తిరిగాయి. జయలలిత మృతి అంశాన్ని డిఎంకె ఈ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించింది.కానీ, ఆశించిన ప్రయోజనాన్ని మాత్రం సాధించలేకపోయింది. మరో వైపు అన్నాడిఎంకెలోని గ్రూపు తగాదాలు, ఆ పార్టీపై ప్రజల అసంతృప్తులు తమకు కలిసివస్తాయని డిఎంకె భావించింది. కానీ, ప్రజలు మాత్రం దినకరన్ వైపు మొగ్గు చూపారు.

English summary
Political analysts said that TTV dinakaran's advantaged from Jayalalitha hospital video in Rk Nagar by poll. Before elections TTV Dinakaran group released a Jayalalitha's video
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X