వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాడు అద్వానీని అరెస్ట్ చేసిన ఆర్కే సింగ్, ఇప్పుడు మోడీ కేబినెట్లో

26 ఆరేళ్ల క్రితం బిజెపి అగ్రనేత ఎల్‌కే అద్వానీ రథయాత్ర బీహార్‌లోకి అడుగు పెట్టినప్పుడు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్.. అద్వానీ అరెస్టుకు ఆదేశాలు జారీ చేశారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 26 ఆరేళ్ల క్రితం బిజెపి అగ్రనేత ఎల్‌కే అద్వానీ రథయాత్ర బీహార్‌లోకి అడుగు పెట్టినప్పుడు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్.. అద్వానీ అరెస్టుకు ఆదేశాలు జారీ చేశారు.

9 మంది కేంద్రమంత్రుల గురించి తెలుసుకోండి9 మంది కేంద్రమంత్రుల గురించి తెలుసుకోండి

అద్వానీ అరెస్టు బాధ్యతను ఇద్దరు అధికారులకు అప్పగించారు. గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు నాడు అద్వానీ రథయాత్ర చేశారు. ఈ సమయంలో రాజ్ కుమార్ సింగ్‌తో పాటు మరో అధికారికి అరెస్టు బాధ్యతలు అప్పగించారు.

అద్వానీని అరెస్ట్ చేసిన ఆర్కే సింగ్ ఇప్పుడు కేంద్రమంత్రి

అద్వానీని అరెస్ట్ చేసిన ఆర్కే సింగ్ ఇప్పుడు కేంద్రమంత్రి

అదే రాజ్ కుమార్ సింగ్ (ఆర్కే సింగ్) ఈ రోజు (ఆదివారం) కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనను ప్రధాని మోడీ తన కేబినెట్లోకి తీసుకున్నారు.

అప్పుడు ఆర్కేసింగ్ బీహార్ ఐఏఎస్ అధికారి

అప్పుడు ఆర్కేసింగ్ బీహార్ ఐఏఎస్ అధికారి

అక్టోబ‌ర్‌ 1990లో ఆర్కే సింగ్ ఐఏఎస్ ఆఫీస‌ర్‌. బీహార్ ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. ఆ రోజు ప్ర‌భుత్వ ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో ఆర్కే సింగ్ పాట్నా నుంచి స‌మ‌స్తిపూర్‌కు వెళ్లారు. ఆయ‌న వెంట ఐపీఎల్ ఆఫీస‌ర్ రామేశ్వ‌ర్ ఓరాన్ కూడా ఉన్నారు. అద్వానీ ఉన్న స‌ర్క్కూట్ హౌజ్‌కు వెళ్లి మిమ్మ‌ల్ని అరెస్ట్ చేయాల‌ని వారెంట్ జారీ అయిందని చెప్పింది ఆర్కే సింగే. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి అద్వానీ తీసుకొని మ‌ళ్లీ పాట్నా వెళ్లారు.

బిజెపి తలరాతను మార్చిన యాత్ర

బిజెపి తలరాతను మార్చిన యాత్ర

ప్ర‌స్తుత జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న మ‌సాంజ‌ర్ గెస్ట్ హౌజ్‌కు అద్వానీని త‌ర‌లించారు. అయోధ్య‌లో రామ మందిర నిర్మాణాన్ని డిమాండ్ చేస్తూ అద్వానీ చేసిన ఈ ర‌థయాత్రే బిజెపి రాత‌ను మార్చిన విషయం తెలిసిందే.

అద్వానీ ఎంపీ.. ఆర్కే సింగ్ మంత్రి

అద్వానీ ఎంపీ.. ఆర్కే సింగ్ మంత్రి

ఈ ర‌థయాత్ర ముగిసిన ఆరేళ్ల త‌ర్వాత తొలిసారి బిజెపి ప్ర‌భుత్వం ఏర్పాటు ఏర్పాటయింది. అద్వానీ డిప్యూటీ ఉప ప్రధానిగా, హోంమంత్రి అయ్యారు. ఇప్పుడు అద్వానీ కేవలం ఎంపీ ప‌ద‌వికే ప‌రిమిత‌మ‌వ‌గా ఆయ‌ను అప్ప‌ట్లో అరెస్ట్ చేసిన ఆర్కే సింగ్ మంత్రి అయ్యారు.

2014 ఎన్నికలకు ముంది బిజెపిలోకి

2014 ఎన్నికలకు ముంది బిజెపిలోకి

1975 బ్యాచ్ బీహార్ కేడర్‌ ఆఫీసర్ అయిన రాజ్ కుమార్ సింగ్‌ యూపీఏ ప్ర‌భుత్వంలో కేంద్ర హోంశాఖ కార్య‌ద‌ర్శిగా కూడా ప‌ని చేశారు. 2014 ఎన్నిక‌ల ముందు బిజెపిలో చేరారు. బీహార్‌లోని ఆరా నుంచి లోకస‌భ‌కు పోటీ చేసి గెలిచారు.

English summary
26 years ago, when BJP leader LK Advani's rath rolled into Bihar, then Chief Minister Lalu Yadav ordered his arrest. He chose two officers to stop Mr Advani's rath yatra from Somnath in Gujarat to Ayodhya in Uttar Pradesh. One of them, Raj Kumar Singh, took oath today to join Prime Minister Narendra Modi's council of ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X