వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇప్పుడు అమిత్ షా.. శనివారం నుంచి 2 రోజుల టూర్, బెంగాల్‌లో బిజీ బిజీ

|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్‌లో అధికారం చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగానే అగ్రనేతలు ప్రచారం చేస్తున్నారు. ఇటీవల జేపీ నడ్డా పర్యటించగా.. ఇప్పుడు అమిత్ షా వంతు వచ్చింది. రాష్ట్రంలో రెండురోజులు పర్యటించి.. క్యాడర్‌లో జోష్ నింపబోతున్నారు. నడ్డా కాన్వాయ్ దాడిపై వివాదం కొనసాగుతోన్న తరుణంలో శనివారం నుంచి రెండురోజులు అమిత్ షా పర్యటించబోతున్నారు.

పర్యటనలో అమిత్ షా రోడ్ షో, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. బీర్భ్‌మ్‌లో రోడ్ షో, మిడ్నాపూర్‌లో ర్యాలీలో మాట్లాడతారు. టీఎంసీని వీడిన బెంగాల్ మాజీ మంత్రి సువెంద్ అదికారి మిడ్నాపూర్‌లో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం ఉంది. బీర్బుమ్‌లో అమిత్ షా రోడ్ షో ఆదివారం ఉంటుంది. అంతకుముందు విశ్వభారతీ వర్సిటీలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

 Roadshow, Public Rally On Amit Shahs List For Two-Day Bengal Visit

పర్యటనలో భాగంగా సమీపంలో గల ఆలయాలను అమిత్ షా సందర్శిస్తారు. స్థానికులతో కలిసి భోజనం చేస్తారు. వచ్చే ఏడాది జరిగే బెంగాల్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ చేసింది. 294 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 200 చోట్ల గెలవాలని అనుకుంటోంది. ఇందులో భాగంగానే అమిత్ షా పర్యటించబోతున్నారు. తర్వాత కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, మధ్యప్రదేశ్ మంత్రులు నరోత్తం మిశ్రా, సంజీవ్ బాల్యన్, ప్రహ్లాద్ పటల్, అర్జున్ ముండా, మంసుఖ్ మాండవియా ఉన్నారు.

English summary
Mission Bengal" in mind, Union Home Minister Amit Shah will be in the state on Saturday for a two-day visit, which will include a roadshow in Birbhum and a public rally in neighbouring Midnapur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X