వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెరైటీ దొంగలు! డబ్బులే కాదు ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు!

|
Google Oneindia TeluguNews

Recommended Video

వెరైటీ దొంగలు! డబ్బులే కాదు ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు! | Oneindia Telugu

ఢిల్లీ : ఏటీఎంలో డబ్బులు దొంగిలించిన ఘటనల గురించి చాలానే విన్నాం. కానీ దొంగలు ఏకంగా ఏటీఎం మెషీన్ ను ఎత్తుకెళ్లిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీ ద్వారాకాలోని నవాడా మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న కార్పొరేషన్ బ్యాంక్ ఏటీఎం సెంటర్ లో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దొంగలు ఎత్తుకెళ్లిన ఏటీఎంలో 30 లక్షల రూపాయల నగదు ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఏటీఎంలో రూ.30 లక్షలు
దొంగతనం జరిగిన సమయంలో ఏటీఎం మెషీన్ లో 30 లక్షల రూపాయలు ఉన్నట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ద్వారకా బ్రాంచ్ కార్పొరేషన్ బ్యాంక్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తుంది. ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బంది బ్యాంకుతో పాటు ఏటీఎం సెంటర్ షట్టర్ ను కూడా మూసివేస్తారు. అయితే సోమవారం రాత్రి సెక్యూరిటీ గార్డ్ ఏటీఎం షట్టర్ మూసివేయడం మరిచిపోవడంతో ఈ ఘటన జరిగిందని అధికారులు చెబుతున్నారు.

Robbers flee with entire ATM machine in Delhi

సీసీ కెమెరాలకు గ్రీజ్ పూసి
ఏటీఎం మెషీన్ చోరీపై అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చోరీ వ్యవహారంలో బ్యాంకు సిబ్బంది ప్రమేయంపైనా ఆరా తీస్తున్నారు.
ఏటీఎంను ఎత్తుకెళ్లిన దొంగలు తమ ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు తెలివిగా వ్యవహరించారు. ఏటీఎం సెంటర్ లోకి వచ్చిన వెంటనే సీసీ కెమెరాల వైర్లు కట్ చేయడంతో పాటు లెన్స్ లకు గ్రీజ్ పూశారు. దీంతో వారి ఆనవాళ్లు కనుక్కోవడం కష్టంగా మారింది. అయితే ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. దొంగతనానికి ముందు రికార్డైన సీసీ టీవీ ఫుటేజ్ ఆధఅనుమానితులను గుర్తించినట్లు ద్వారకా డీసీపీ చెప్పారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు.

English summary
Robbers fled with with an entire ATM machine of the Corporation Bank which had around Rs 30 lakh inside near the Nawada metro station in Dwarka. The robbers covered the CCTV cameras with grease. A case has been registered and the investigation has been initiated. Police has formed teams to nab the accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X