• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

11 సార్లు 70 గంటలు ప్రశ్నించారు: ఇది రాజకీయ కక్ష సాధింపే అన్న రాబర్ట్ వాద్రా

|

న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రా గురువారం ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. ఆయన భార్య యూపీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకాగాంధీ ఈడీ కార్యాలయం వద్ద డ్రాప్ చేశారు. అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ వాద్రాకు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే వాద్రా ఈడీ ఆఫీసుకు వెళ్లారు. ఇప్పటి వరకు తనను 70 గంటల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ అధికారులు విచారణ చేశారని వాద్రా ఓ ఫేస్‌బుక్ పోస్టు ద్వారా తెలిపారు.

లండన్‌లో కొన్న ఆస్తులు, దుబాయ్, రాజస్థాన్, రాజధాని ప్రాంతంలో ఆస్తుల కొనుగోలుపై గురువారం రాబర్ట్ వాద్రాను విచారణ చేశారు. అక్రమాస్తుల కేసులో విచారణకు ఈడీ అధికారులు పిలువడం ఇది తొమ్మిదవసారి కావడం విశేషం. ఇప్పటి వరకు తనను 70 గంటల పాటు విచారణ చేశారని... తను ఎలాంటి తప్పుచేయలేదని రాబర్ట్ వాద్రా ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. అన్ని ఆరోపణల నుంచి కడిగిన ముత్యంలా బయటకొస్తాననే విశ్వాసం వ్యక్తం చేసిన వాద్రా తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని అన్నారు. మరోవైపు ఈడీ అధికారులకు ఎప్పటిలాగే తన వైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు. మరోవైపు తన భర్తకు కష్టకాలంలో కచ్చితంగా అండగా ఉంటానని ప్రియాంకా గాంధీ చెప్పారు. రాజకీయంగా కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని వాద్రా మండిపడ్డారు.

Robert vadra called for enquiry by ED, leaves a face book post

ఇదిలా ఉంటే రాబర్ట్ వాద్రా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు లండన్‌లో 12 మిలియన్ పౌండ్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ఇందులో మూడు విల్లాలు, మిగతావి విలాసవంతమైన ఫ్లాట్లుగా గుర్తించింది. ఇవ్వనీ 2005 నుంచి 2010లో వాద్రా కొన్నట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నింది. రాబర్ట్ వాద్రా విచారణకు సహకరించడం లేదని ఆయన్ను కస్టడీలోకి తీసుకుంటామని ఆమేరకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఢిల్లీ హైకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. బినామీ కేసులో కొత్త ఆధారాలు లభించాయని అందుకే విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసులు ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Businessman Robert Vadra was dropped by wife Priyanka Gandhi Vadra at the office of the Enforcement Directorate in Delhi this morning. He was asked to appear before the probe agency for questioning, as part of investigation into alleged illegal property deals.Earlier this morning, Mr Vadra, said he has been questioned for 70 hours by government agencies so far. He is being investigated over allegations of money-laundering and illegal land deals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more