వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనీ ల్యాండరింగ్ కేసులో వాద్రా కు ఊరట .. షరతులతో కూడిన ముందస్తు బెయిల్

|
Google Oneindia TeluguNews

మ‌నీలాండ‌రింగ్ కేసులో సోనియాగాంధీ అల్లుడు రాబ‌ర్ట్ వాద్రాకు ఏప్రిల్ 1న స్పెష‌ల్ సీబీఐ కోర్టు షరతులతో కూడిన ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది. వాద్రా స‌న్నిహితుడు మ‌నోజ్ అరోరాకు కూడా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తన క్లయింట్‌పై రాజకీయ ప్రతీకారానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని వాద్రా తరఫు న్యాయవాది కేటీ తులసి కోర్టులో తమ వాదన వినిపించారు .

లండన్‌కు చెందిన 1.9మిలియన్‌ పౌండ్ల విలువ గల స్థిరాస్తి వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ వాద్రాపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేయడంతో యుపిఎ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా ఇరకాటంలో పడ్డారు. ముందస్తు బెయిల్‌ కోసం ఢిల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన వాద్రా పిటిషన్ ను విచారించిన డిల్లీ న్యాయస్థానం ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.
ఫిబ్రవరి 16 వరకూ అరెస్టు చేయకూడదని, తదుపరి వాద్రానే ఈడీ విచారణకు హాజరవుతారని వాద్రా చేసిన పిటిషన్ కు కోర్టు అంగీకరించింది.

Robert Vadra gets relief with anticipatory bail in money laundering case

ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వాద్రా స్నేహితుడు మనోజ్ ఆరోరా కూడా ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందారు.ముంద‌స్తు బెయిల్ కోసం ఇద్ద‌రూ 5 ల‌క్ష‌ల ప‌ర్స‌న‌ల్ బాండ్ల‌ను స‌మ‌ర్పించాలని కోర్టు తెలిపింది.
ప్ర‌స్తుతం ఈ కేసులో ఇద్ద‌రూ మ‌ధ్యంత‌ర బెయిల్‌ పై ఉన్నారు. కోర్టు అనుమ‌తి లేకుండా దేశం విడిచి వెళ్ల‌కూడదని జడ్జి అరవింద్ కుమార్ వాద్రాకు సూచించారు.విచారణ అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరవ్వాలని సూచించింది. ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ ల‌భించ‌డం ఒక‌ర‌కంగా వాద్రాకు పెద్ద ఊర‌ట గా భావించవచ్చు.

English summary
Putting a stop to the Enforcement Directorate's push for Robert Vadra's custodial interrogation in a money laundering case, a special CBI court in Delhi yesterday granted his anticipatory bail plea. The court also allowed anticipatory bail to Vadra's close aide Manoj Arora. Both of them have to furnish a personal bail bond of Rs 5 lakh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X